Gold Rate Today: బంగారం ముట్టుకుంటే షాకే..99వేలకు తులం బంగారం ధర
Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అందరూ ఊహించినట్లుగానే బంగారం ధర వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం లక్ష రూపాయలకు రెండు అడుగుల దూరంలో ఉన్నాయి. చాలా మంది బంగారం ధఱ సంవత్సరం చివరి వరకు లకష్ రూపాయలకు చేరదనే అనుకున్నారు. కానీ అనూహ్యంగా ధర లక్షకు సమీపానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
శనివారంలో పోల్చితే బంగారం ధర దాదాపు 400 రూపాయలు పెరిగింది. దీంతో బంగారం ధర సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్లింది. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98, 510 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89, 850 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 98,300 పలుకుతోంది. బంగారం ధర గడిచిన వారం రోజులుగా భారీగా పెరుగుతోంది. గతవారం ప్రారంభంలో బంగారం ధర రూ. 90వేల నుంచి రూ. 98 వేల వరకు దూసుకెళ్లింది. దాదాపు 8వేల రూపాయలు పెరిగింది.
బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులే కారణమని చెప్పవచ్చు. బంగారం ధరలు గత నెలరోజులుగా గమనిస్తే భారీగా పెరుగుతూ వచ్చాయి. బంగారం ధర రికార్డు స్థాయిని దాటేసింది. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి.