Gold and Silver Prices: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి పసిడి ప్రియులకు మరో షాక్
పండుగ సీజన్‌లో బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ధరలు మళ్లీ షాకిస్తున్నాయి.
Gold and Silver Prices: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి పసిడి ప్రియులకు మరో షాక్
పండుగ సీజన్‌లో బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. శనివారం ఒకే రోజు తులం బంగారం (10 గ్రాములు)పై రూ. 870, కిలో వెండిపై రూ. 3,000 పెరిగింది. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం కారణంగా ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
నేటి బంగారం, వెండి ధరలు (అక్టోబర్ 4, 2025):
24 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర రూ. 870 పెరిగి రూ. 1,19,400 వద్ద ఉంది.
22 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర రూ. 800 పెరిగి రూ. 1,09,450 వద్ద ట్రేడ్ అవుతోంది.
18 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర రూ. 650 పెరిగి రూ. 89,550 వద్ద ఉంది.
వెండి: కిలో వెండి ధర రూ. 3,000 పెరిగి రూ. 1,55,000 వద్ద అమ్ముడవుతోంది. చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ. 1,65,000కు చేరుకుంది.
దసరా ముందు భారీగా పెరిగిన ధరలు, దీపావళి నాటికైనా తగ్గుతాయని ఆశించిన వారికి ఈ తాజా పెరుగుదల నిరాశ కలిగించింది