ఆల్ టైం హైకి చేరిన గోల్డ్, సిల్వర్
గోల్డ్ రేస్ కంటిన్యూ అవుతోంది. బంగారం, వెండి ధరలు సరికొత్త శిఖరాలకు చేరాయి.
ఆల్ టైం హైకి చేరిన గోల్డ్, సిల్వర్
గోల్డ్ రేస్ కంటిన్యూ అవుతోంది. బంగారం, వెండి ధరలు సరికొత్త శిఖరాలకు చేరాయి. ఎంసీఎక్స్ లో పదిగ్రాముల బంగారం 879 రూపాయలు భారమై ఏకంగా 1,30,383 రూపాయలకు ఎగబాకింది. ఒక్క రోజులోనే వెండి రూ. 3639 పెరిగి 1,78,620 రూపాయలకు చేరింది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలతో పాటు రూపాయి బలహీనతతో హాట్ మెటల్స్ పరుగులు పెడుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ బంగారం ఈరోజు ఓ దశలో 4,240 డాలర్లు పలికింది. గోల్డ్, సిల్వర్ ధరలు మరికొంత కాలం ఒడిదుడుకులతో సాగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.