దేశీయ మార్కెట్ లో విలువైన లోహాల మెరుపులు..

Update: 2020-12-03 06:14 GMT

దేశీయ మార్కెట్లో విలువైన లోహాలు మెరుపులు మెరిపిస్తున్నాయి. అనిశ్చిత సమయాల్లో పసిడిలో పెట్టుబడులు సురక్షితమని మదుపర్లు భావిస్తుండటంతో ధరలకు రెక్కలు వచ్చినట్లయింది. దేశీయ విఫణి మల్టీ కమోడిటీ ఎక్సేంజీ ఎంసిఎక్స్ లో పసిడి ఫ్యూచర్స్ 10 గ్రాములు 0.62 శాతం మేర పెరిగి 49,252 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా మరో విలువైన లోహం వెండి కిలోకు 0.77 శాతం ఎగసి 63,812 రూపాయల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్ స్పాట్ మార్కెట్ లో బంగారం 10 గ్రాముల ధర 50,760 రూపాయల వద్దకు చేరగా వెండి కిలో 64,970 రూపాయలుగా నమోదవుతోంది. సాధారణంగా విలువైన లోహాల ధరలపై ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ , కేంద్ర బ్యాంకుల్లోని బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు ప్రభావం చూపుతూ వుంటాయి.

Tags:    

Similar News