Gold Rate: ఎగిసిన బంగారం, వెండి ధరలు..

Gold Rate: దేశీయ మార్కెట్లో పరుగులు పెడ్తున్న విలువైన లోహం పసిడి ధరలు

Update: 2021-02-24 04:35 GMT

Gold Rate: దేశీయ మార్కెట్లో విలువైన లోహం పసిడి ధరలు పరుగులు పెడ్తున్నాయి. దేశీయ విఫణి మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్- ఎంసీఎక్స్‌లో ఎల్లోమెటల్ వరుసగా రెండో రోజు పరుగులు తీస్తూ గరిష్టాలను నమోదు చేశాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల గోల్డ్ ధర 0.13 శాతం మేర పెరిగి 46వేల 917 రూపాయల వద్దకు చేరగా.. మరో విలువైన లోహం వెండి ఫ్యూచర్స్ కిలోకు 0.17 శాతం పెరిగి 69వేల 730 వద్దకు చేరాయి. దేశీయ స్పాట్ మార్కెట్‌లో 10 గ్రాముల ధర 650 రూపాయల మేర పెరిగి 50 వేల మార్క్‌కు ఎగువన 50వేల 180 రూపాయల వద్దకు చేరింది.

అదే విధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, విశాఖల్లో 22 క్యారెట్ల ధర 43వేల 850గా నమోదు కాగా...24 క్యారెట్ల ధర 48వేల 360 రూపాయల వద్దకు చేరింది. కాగా అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతూ వుంటాయి.

Tags:    

Similar News