ఎల్‌ఐసీ సులువైన రుణసదుపాయం.. బ్యాంకుతో పోల్చితే వడ్డీ తక్కువే..!

LIC Loan: జీవితంతో పాటు, జీవితం తర్వాత కూడా.. మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ట్యాగ్‌లైన్‌ని తప్పనిసరిగా చదివే ఉంటారు.

Update: 2022-11-13 05:40 GMT

ఎల్‌ఐసీ సులువైన రుణసదుపాయం.. బ్యాంకుతో పోల్చితే వడ్డీ తక్కువే..!

LIC Loan: జీవితంతో పాటు, జీవితం తర్వాత కూడా.. మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ట్యాగ్‌లైన్‌ని తప్పనిసరిగా చదివే ఉంటారు. ఎల్‌ఐసీ అన్ని వర్గాలకి పాలసీలని అందిస్తోంది. దీనిపై పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. ఎల్‌ఐసి పాలసీపై రుణం పొందవచ్చని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇది వ్యక్తిగత రుణం కంటే మెరుగైన ఎంపికని చెప్పవచ్చు. ఎల్‌ఐసిపై రుణం సురక్షితమైన ఎంపిక. మీ ఫండ్ దీని వల్ల ప్రభావితం కాదు అన్ని అవసరాలు కూడా నెరవేరుతాయి. ఎల్‌ఐసి పాలసీపై ఎలా లోన్ తీసుకోవచ్చో ఈ రోజు తెలుసుకుందాం.

LIC పాలసీపై రుణం పొందేందుకు అర్హత..?

1. మీరు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే LIC పాలసీని కలిగి ఉండాలి.

2. రుణం తీసుకోవడానికి వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

3. రుణం తీసుకోవడానికి ఉపయోగించే ఎల్‌ఐసి పాలసీకి హామీ ఇవ్వబడిన సరెండర్ విలువ ఉండాలి.

4. ఎల్‌ఐసీ ప్రీమియంను మూడేళ్లపాటు పూర్తిగా చెల్లించిన తర్వాత మాత్రమే మీరు పాలసీపై రుణం పొందవచ్చు.

5. ముందుగా LIC అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

6. అక్కడ ఆన్‌లైన్ లోన్ ఎంపిక కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.

7. LIC ఆన్‌లైన్ లోన్ కోసం 'త్రూ కస్టమర్ పోర్టల్'పై క్లిక్ చేయండి.

8. ఇక్కడ మీరు యూజర్ ఐడి, పుట్టిన తేదీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.

9. ఇప్పుడు మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్న పాలసీని ఎంచుకోండి.

10. మీ దరఖాస్తు ఆమోదం పొందిన 3-5 రోజులలోపు లోన్ ఆమోదిస్తారు.

ఆఫ్‌లైన్ లోన్ ప్రక్రియ..?

దీని కోసం సమీపంలోని ఎల్‌ఐసి కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ లోన్ దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి. అసలు LIC పత్రాలతో పాటు KYC పత్రాలను సమర్పించాలి. ఇప్పుడు వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అన్నీ సరిగ్గా జరిగితే పాలసీ సరెండర్ ప్రైజ్‌లో 90 శాతం వరకు రుణం ఇస్తారు.

ఏ పత్రాలు అవసరం?

రుణం కోసం కొన్ని పత్రాలు అవసరం. అవి- ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, ఆదాయ ధృవీకరణ పత్రంలో బ్యాంక్ వివరాలు, చెల్లింపు స్లిప్ వంటి పత్రాలు ఉండాలి.

Tags:    

Similar News