LPG Price: సామాన్యుడికి బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
LPG Price: ప్రతి నెల మొదటి తారీఖున గ్యాస్ సిలిండర్ ధరలు మారుతాయి. ఈ జూలై 1న కూడా గ్యాస్ ధరలపై ఒక అప్‌డేట్ వచ్చింది. వ్యాపారులు, హోటళ్లు నడిపే వారికి ఇది గుడ్‌న్యూస్ కాగా, ఇంట్లో వంట చేసుకునే వారికి మాత్రం పెద్దగా మార్పు లేదు.
LPG Price: సామాన్యుడికి బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
LPG Price: ప్రతి నెల మొదటి తారీఖున గ్యాస్ సిలిండర్ ధరలు మారుతాయి. ఈ జూలై 1న కూడా గ్యాస్ ధరలపై ఒక అప్‌డేట్ వచ్చింది. వ్యాపారులు, హోటళ్లు నడిపే వారికి ఇది గుడ్‌న్యూస్ కాగా, ఇంట్లో వంట చేసుకునే వారికి మాత్రం పెద్దగా మార్పు లేదు. జూలై 1న గ్యాస్ సిలిండర్ ధరలు ఎంత ఉన్నాయో, ఎంత తగ్గాయో వివరంగా చూద్దాం.
వ్యాపార అవసరాలకు ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు వరుసగా నాలుగో నెల కూడా తగ్గాయి. ఇది హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాల్స్ నడిపే వారికి పెద్ద ఊరట లభించినట్లే. ఢిల్లీలో రూ.58.50 తగ్గి, ఇప్పుడు రూ.1665కి చేరింది. కోల్‌కతాలో రూ.57 తగ్గి రూ.1769కి, ముంబైలో రూ.58 తగ్గి రూ.1616.50కి, చెన్నైలో రూ.57.50 తగ్గి రూ.1823.50కి చేరుకుంది. హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.25.50 తగ్గి రూ.1,943.50కి చేరింది. ఈ నాలుగు నెలల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు సుమారు రూ.140 వరకు తగ్గాయి. ఇది వ్యాపారులకు చాలా ఖర్చులు ఆదా చేస్తుంది.
ఇంట్లో వాడుకునే దేశీయ గ్యాస్ సిలిండర్ల ధరలలో మాత్రం ఈ నెల ఎలాంటి మార్పు లేదు. చివరిసారిగా ఏప్రిల్ 8న సిలిండర్‌కు రూ.50 పెరిగింది. ఆ తర్వాత నుంచి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో దేశీయ గ్యాస్ సిలిండర్ ధర రూ.853గా ఉండగా, కోల్‌కతాలో రూ.879, ముంబైలో రూ.852.50, చెన్నైలో రూ.868.50గా ఉంది. హైదరాబాద్‌లో 14.2 కేజీల దేశీయ సిలిండర్ ధర రూ.905గా ఉంది. గత ఏప్రిల్ 2025 నుండి ఈ ధరలో ఎలాంటి మార్పు లేదు.
కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గడం మంచిదే. కానీ సామాన్య ప్రజలకు దేశీయ గ్యాస్ ధరలు స్థిరంగా ఉండటం కొంత నిరాశ కలిగిస్తుంది. ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం దేశీయ సిలిండర్ల ధరలను కూడా తగ్గించే అవకాశం ఉంటే బాగుంటుంది, ఇది ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.