EPFO : నెలకు రూ.22,000 జీతంతో EPFO ద్వారా రూ. కోటి ఎలా సంపాదించాలో తెలుసా ?
EPFO: మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ ఇలా చాలా ఉన్నాయి. అయితే, వీటిలో కొంత రిస్క్ ఉంటుంది.
EPFO : నెలకు రూ.22,000 జీతంతో EPFO ద్వారా రూ. కోటి ఎలా సంపాదించాలో తెలుసా ?
EPFO: మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ ఇలా చాలా ఉన్నాయి. అయితే, వీటిలో కొంత రిస్క్ ఉంటుంది. పైగా మీరు ప్రతీ నెలా డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. కానీ, మీరు EPFO అకౌంట్ ఉన్న ఏదైనా కంపెనీలో పనిచేస్తుంటే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మీ నెలవారీ బేసిక్ జీతం రూ.22,000 మాత్రమే ఉన్నా సరే, మీరు పదవీ విరమణ తర్వాత రూ.కోటి ఫండ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక సహాయం అందించడానికి EPFO కింద PF ఫండ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో ప్రభుత్వ ఉద్యోగులను కూడా చేర్చారు. అయితే, ఇది ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే వారికి పదవీ విరమణ తర్వాత సాధారణంగా ఇతర ఆర్థిక సహాయం పెద్దగా లభించదు. మీరు EPFO కింద PF ఖాతాను తెరిచి మీ నెలవారీ బేసిక్ జీతం రూ.22,000 అయితే, రూ.కోటి కంటే ఎక్కువ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. దీని లెక్కలు, వడ్డీ విధానాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
రూ.1 కోటి ఎలా సాధ్యం? వడ్డీ రేటు వివరాలు
పీఎఫ్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ నిధి ఎలా రూ.కోటి దాటుతుందో అర్థం చేసుకోవడానికి ముందు, ప్రభుత్వం ఎంత వడ్డీని అందిస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. EPFO PF పై లభించే వడ్డీ రేటును 8.15% నుండి 8.25% కి పెంచింది. ఈ వడ్డీ రేటు మీ జమ చేసిన మొత్తానికి వార్షికంగా లభిస్తుంది. కాంపౌండింగ్ (చక్రవడ్డీ) ద్వారా పెరుగుతూ ఉంటుంది.
ఇప్పుడు, రూ.22,000 నెలవారీ బేసిక్ జీతం, డియర్‌నెస్ అలవెన్స్ (DA) తో మీరు ఎలా రూ. కోటి ఫండ్‌ను సమకూర్చుకోవచ్చో చూద్దాం. ఉదాహరణకు: మీ నెలవారీ బేసిక్ జీతం రూ.22,000. మీరు 30 సంవత్సరాల వయస్సులో ఉద్యోగం ప్రారంభించారు. అప్పటి నుంచే PFలో కూడా పెట్టుబడి పెడుతున్నారు. మీరు మీ నెలవారీ బేసిక్ జీతంలో 12% అకౌంట్‌లో జమ చేస్తున్నారు, మీ కంపెనీ కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తోంది. మీ జీతం ఏడాదికి 5% చొప్పున పెరుగుతోందని అనుకుందాం. అప్పుడు, 8.25% వడ్డీ రేటుతో, మీ పదవీ విరమణ తర్వాత మొత్తం నిధి రూ.1,04,75,434 అవుతుంది. ఈ లెక్కల ప్రకారం, EPFO ద్వారా రూ.1 కోటి కంటే ఎక్కువ ఫండ్‌ను సులభంగా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రైవేట్ ఉద్యోగులకు ఇది చాలా ప్రయోజనకరమైన పథకం.