PRAN Card: దేశంలోని ప్రతి ఉద్యోగికి PRAN కార్డ్ అవసరం.. ఇలా అప్లై చేయండి..!

PRAN Card: మీరు నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)కింద ఖాతాను తెరిచి ఉంటే PRAN కార్డ్ కలిగి ఉండటం చాలా అవసరం.

Update: 2022-12-26 13:30 GMT

PRAN Card: దేశంలోని ప్రతి ఉద్యోగికి PRAN కార్డ్ అవసరం.. ఇలా అప్లై చేయండి..!

PRAN Card: మీరు నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)కింద ఖాతాను తెరిచి ఉంటే PRAN కార్డ్ కలిగి ఉండటం చాలా అవసరం. ఇది లేదంటే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. PRAN అనేది పర్మనెంట్‌ రిటైర్‌మెంట్‌ అకౌంట్‌. 12 అంకెల సంఖ్య. ఇది నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద నమోదు చేసుకున్న వ్యక్తులను గుర్తిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు PRAN కార్డు అవసరమవుతుంది. దీని కోసం నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL)లో నమోదు చేసుకోవచ్చు.

PRAN కింద రెండు రకాల NPS ఖాతాలు ఉంటాయి. టైర్-I ఖాతా విత్‌ డ్రా చేసుకోలేనిది. మరొకటి రిటైర్‌మెంట్‌ పొదుపు కోసం కేటాయించింది. టైర్ -II ఖాతా పొదుపు ఖాతా. ఇది మీ పొదుపులను విత్‌ డ్రా చేయడానికి అనుమతి ఇస్తుంది. అయితే దీని వల్ల ఎలాంటి పన్ను ప్రయోజనం ఉండదు. PRAN కార్డ్ ఒక విధంగా ప్రత్యేకమైన ID లాగా పనిచేస్తుంది. చందాదారు దానిని మార్చలేరు. PRAN కార్డ్ కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

PRAN ఎలా దరఖాస్తు చేయాలి..?

జాతీయ పెన్షన్ సిస్టమ్ చందాదారులకు PRAN (శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య) జారీ అవుతుంది. PRAN కార్డుకి దరఖాస్తు చేస్తున్నప్పుడు సబ్‌స్క్రైబర్ వ్యక్తిగత వివరాలు, సబ్‌స్క్రైబర్ ఉద్యోగ వివరాలు, నామినేషన్ వివరాలు, సబ్‌స్క్రైబర్ స్కీమ్ వివరాలు, PFRDA (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ) డిక్లరేషన్ అందించాలి.

ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి..

1. మీరు NSDL లేదా Karvy వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేయడం వల్ల మొత్తం ప్రక్రియను చేయవచ్చు.

2. భారతదేశంలో NPS ఖాతాలను మెయింటెన్‌ చేయడం, ఓపెన్‌ చేయడం CRAకి అప్పగించారు.

3. మీరు ఆన్‌లైన్ పోర్టల్‌ని ఉపయోగించి ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్‌తో PRAN కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

4. ఆధార్ కార్డును ఉపయోగించి PRAN కోసం దరఖాస్తు చేస్తే NPS KYC, ఆధార్ OTP ఉపయోగించి ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

5. ఆధార్ డేటాబేస్‌లో నమోదైన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.

6. మీ జనాభా వివరాలు, ఫోటో ఆధార్ డేటాబేస్ నుంచి తీసుకుంటారు.

7. అవసరమైన అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో పూరించాలి.

8. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మీరు స్కాన్ చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. ఇది 4kb నుంచి 12kb మధ్య ఉండాలి.

9. ఆధార్ కార్డ్ నుంచి ఫోటోను మార్చాలనుకుంటే స్కాన్ చేసిన ఫోటోను అప్‌లోడ్ చేయవచ్చు.

10. మీ NPS ఖాతా కోసం డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు చేయడానికి మళ్లించబడతారు.

11. చెల్లింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత PRAN కార్డ్ రెడీ అవుతుంది.

ఈ పత్రాలు అవసరం

PRAN కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి తప్పనిసరిగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, కలిగి ఉండాలి. దీంతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్ చేసిన కాపీ, బ్యాంక్ పాస్‌బుక్, మీ సంతకం స్కాన్ చేసిన కాపీ, పాస్‌పోర్ట్ స్కాన్ చేసిన కాపీని అవసరమవుతాయి.

Tags:    

Similar News