Employees Pension: సంఘటిత రంగ ఉద్యోగుల పెన్షన్‌కి సంబంధించి రూ. 15000 పరిధి ముగుస్తుంది..!

Employees Pension: సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులు పెన్షన్ విషయంలో త్వరలో శుభవార్త అందుకుంటారు.

Update: 2022-05-14 12:30 GMT

Employees Pension: సంఘటిత రంగ ఉద్యోగుల పెన్షన్‌కి సంబంధించి రూ. 15000 పరిధి ముగుస్తుంది..!

Employees Pension: సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులు పెన్షన్ విషయంలో త్వరలో శుభవార్త అందుకుంటారు. ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఆర్గనైజేషన్ (EPFO) ​​సంఘటిత రంగ ఉద్యోగుల కోసం కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకురావాలని ఆలోచిస్తోంది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) కింద విధించిన పరిమితిని ప్రభుత్వం త్వరలో తొలగించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అత్యధికంగా పెన్షన్‌ పొందే జీతం నెలకు రూ.15,000 వరకే పరిమితం చేశారు. అంటే మీ జీతం ఎంతైనా సరే పెన్షన్ లెక్క రూ.15,000 మాత్రమే. ఈ పరిమితి తొలగింపునపై కోర్టులో విచారణ జరుగుతోంది.

ఉద్యోగం చేసే ప్రతి వ్యక్తి EPSలో మెంబర్ అవుతాడు. దీని కింద ఉద్యోగి తన జీతంలో 12% EPFలో జమ చేస్తాడు. ఆపై అంతే మొత్తాన్ని కంపెనీ జమ చేస్తుంది. అయితే ఇందులో కొంత భాగం 8.33% EPSకి వెళుతుంది. కానీ 15 వేల రూపాయల పరిమితి కారణంగా మొత్తం పెన్షన్ (15,000 లో 8.33%) 1250 రూపాయలు వస్తుంది. ఉద్యోగి రిటైర్మెంట్ చేసినప్పుడు పెన్షన్‌ను లెక్కించడానికి గరిష్ట వేతనం రూ. 15 వేలుగా పరిగణిస్తారు. దీని ప్రకారం ఒక ఉద్యోగి EPS కింద పొందగలిగే గరిష్ట పెన్షన్ రూ.7,500.

పెన్షన్ ఎలా లెక్కిస్తారో తెలుసా? మీరు సెప్టెంబరు 1, 2014 కంటే ముందు EPSకి కంట్రిబ్యూట్ చేయడం ప్రారంభించినట్లయితే మీకు పెన్షన్ కంట్రిబ్యూషన్ కోసం గరిష్టంగా నెలవారీ జీతం రూ.6500 ఉంటుంది. మీరు సెప్టెంబర్ 1, 2014 తర్వాత EPSలో చేరినట్లయితే గరిష్ట జీతం పరిమితి 15,000. ప్రకారం పెన్షన్ లెక్కిస్తారు.

నెలవారీ పెన్షన్ = (పెన్షనబుల్ జీతం x ఇపిఎస్ కంట్రిబ్యూషన్ సంవత్సరాలు)/70 ఇక్కడ ఉద్యోగి 1 సెప్టెంబర్, 2014 తర్వాత EPSకి కంట్రిబ్యూట్ చేయడం ప్రారంభించాడు అనుకుందాం. అప్పుడు పెన్షన్ కంట్రిబ్యూషన్ రూ. 15,000 అవుతుంది. అతను 30 సంవత్సరాలు పని చేసాడనుకుందాం.

నెలవారీ పెన్షన్ = 15,000X30/70 = రూ 6428

Tags:    

Similar News