EPFO: పీఎఫ్ ఖాతాదారులకి అలర్ట్.. పెద్ద నష్టం జరిగే అవకాశం జాగ్రత్త..!

EPFO: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులందరికి హెచ్చరిక జారీ చేసింది.

Update: 2022-08-16 12:30 GMT

EPFO: పీఎఫ్ ఖాతాదారులకి అలర్ట్.. పెద్ద నష్టం జరిగే అవకాశం జాగ్రత్త..!

EPFO: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులందరికి హెచ్చరిక జారీ చేసింది. పొరపాటున కూడా సోషల్ మీడియాలో ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయవద్దని సూచించింది.ఎందుకంటే దీనివల్ల ఖాతాదారులు పెద్ద మోసాలకు గురవుతున్నారు. ఈపీఎఫ్‌వో సభ్యుల నుంచి ఆధార్, పాన్, UAN, బ్యాంక్ వివరాలని అడగదని గుర్తుంచుకోండి. ఎవరైనా అలాంటి సమాచారాన్ని ఫోన్ లేదా సోషల్ మీడియాలో అడిగితే అస్సలు చెప్పకూడదు. ఇలాంటి మోసపూరిత ఫోన్ కాల్స్‌కి సమాధానం ఇవ్వొద్దు.

ఈపీఎఫ్‌వో వినియోగదారులందరికీ హెచ్చరిక జారీ చేస్తూ ఒక ట్వీట్‌ చేసింది. 'ఫోన్ లేదా సోషల్ మీడియా ద్వారా ఆధార్, పాన్, UAN, బ్యాంక్ ఖాతా లేదా OTP వంటి వ్యక్తిగత వివరాలను షేర్ చేయవద్దని తెలిపింది. EPFO ఏ సేవ కోసం వాట్సాప్, సోషల్ మీడియా మొదలైన వాటి ద్వారా డబ్బులు డిపాజిట్ చేయమని అడగదని గుర్తుంచుకోండి. ఉద్యోగులు రిటైర్‌మెంట్ తర్వాత బతకడానికి పీఎఫ్ ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు జమ చేసుకుంటారు. ఇలాంటి వాటిపై మోసగాళ్లు గురిపెడుతున్నారు. ఎందుకంటే పెద్ద మొత్తంలో దోచుకోవచ్చని ఉపాయం.

కాబట్టి వారు ఫిషింగ్ ద్వారా ఖాతాపై దాడి చేస్తారు. వాస్తవానికి ఫిషింగ్ అనేది ఆన్‌లైన్ మోసం. ఇందులో ఖాతాకు సంబంధించిన అవసరమైన సమాచారాన్ని వారి నుంచే పొంది ఆపై ఖాతాలో ఉన్న సొమ్ముని కాజేస్తారు. ఒక ఉద్యోగాన్ని వదిలి మరో ఉద్యోగంలో చేరే సమయంలో ఇలాంటి మోసాలు జరుగుతాయి. పరిస్థితిలో ఖాతాదారులు వ్యక్తిగత వివరాలను ఎవ్వరితో షేర్ చేసుకోకూడదు. ఒకవేళ ఇలాంటి మోసం ఏదైనా జరిగితే వెంటనే పోలీసులని సంప్రదించాలి.

Tags:    

Similar News