డ్రాగన్ కంపెనీలకు షాకిచ్చిన ఈడీ.. వివో కంపెనీ సహా పలు చైనీస్ సంస్థలపై మెరుపు దాడులు..

Enforcement Directorate (ED): డ్రాగన్ కంపెనీలకు ఈడీ షాకిచ్చింది.

Update: 2022-07-05 12:00 GMT

డ్రాగన్ కంపెనీలకు షాకిచ్చిన ఈడీ.. వివో కంపెనీ సహా పలు చైనీస్ సంస్థలపై మెరుపు దాడులు..

Enforcement Directorate (ED): డ్రాగన్ కంపెనీలకు ఈడీ షాకిచ్చింది. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా వివో కంపెనీ సహా పలు చైనీస్ సంస్థలపై ఈడీ దాడులు చేపట్టింది. దేశంలోని 44 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈ దాడులు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. బిహార్‌, ఝార్ఖండ్‌, యూపీ, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

గతంలో నమోదైన కేసులతో పాటు మరో కొత్త కేసును ఈడీ నమోదు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తాజా దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వివో సహా అనుబంధ సంస్థలపై సోదాలు ఇంకా కొనసాగుతాయని ఈడీ అధికరాలు తెలిపారు. అయితే దేశవ్యాప్తంగా ఈడీ జరిపిన సోదాల్లో పలు కీలక పత్రాలు, భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News