Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market: సెన్సెక్స్ 99.56, నిఫ్టీ 21.20 పాయింట్ల లాభం
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. గరిష్ఠాల వద్ద మరోసారి అమ్మకాల ఒత్తిడి ఎదురవడంతో ఉదయం లాభాల్లోకి వెళ్లిన సూచీలు... స్వల్ప లాభాలకే పరిమితం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు దీనికి తోడయ్యాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్ సమావేశం ఇవాళ ప్రారంభం కానుంది. వడ్డీ రేట్లపై ఫెడ్ ఏం నిర్ణయం తీసుకుంటుదనేది అంతర్జాతీయ మార్కెట్లు ఆసక్తిగా గమనిస్తున్నాయి. సెన్సెక్స్ 81 వేల 349.28 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81 వేల 230 - 81 వేల 815 మధ్య కదలాడింది. చివరికి 99.56 పాయింట్ల లాభంతో 81 వేల 455.40 వద్ద ముగిసింది. నిఫ్టీ 21.20 పాయింట్ల లాభంతో 24 వేల 857.30 వద్ద స్థిరపడింది.