Indian Railways: రైల్వే కోచ్‌లపై ఆకుపచ్చ-పసుపు గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? ఆ బోగీలో ఎక్కితే భారీగా జరిమానా పడుద్ది..!

Indian Railways Interesting Facts: మీరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు కోచ్‌ల వెలుపల తెలుపు, ఆకుపచ్చ లేదా పసుపు చారలను చాలాసార్లు చూసి ఉంటారు. వాటి అర్థం తెలుసుకోకుంటే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

Update: 2023-06-24 08:45 GMT

Indian Railways: రైల్వే కోచ్‌లపై ఆకుపచ్చ-పసుపు గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? ఆ బోగీలో ఎక్కితే భారీగా జరిమానా పడుద్ది..!

White, Yellow, Green Stripes on Trains: మీరు రైళ్లలో చాలాసార్లు ప్రయాణించే ఉంటారు. ఈ ప్రయాణంలో, మీరు రైల్వే స్టేషన్లు, రైళ్లలో రాసిన అనేక రకాల సంకేతాలు, సంఖ్యలను చూసి ఉండే ఉంటారు. కానీ, వాటికి ఉన్న అసలు అర్థం మీకు తెలియదు. అందులో ముఖ్యంగా కొన్ని గుర్తులు ఉన్నాయి. వాటిలో రైళ్ల పైన కనిపించే నీలం, తెలుపు గీతలు. ఈ లైన్లు రైళ్లను డిజైన్‌లు చేయడానికి తయారు చేయబడలేదు. అయితే, వీటి వెనుక ప్రత్యేక కారణం ఉంది. రైళ్లలో కనిపించే పసుపు-తెలుపు గీతల రహస్యాన్ని ఈ రోజు తెలుసుకుందాం..

ఆకుపచ్చ చారల అర్థం ఏంటంటే?

రైలులో ప్రయాణిస్తున్నప్పుడు, కంపార్ట్‌మెంట్‌ అంచున ఆకుపచ్చ గీతలు కనిపిస్తే, కోచ్ మహిళలకు కేటాయించారని అర్థం. ఇటువంటి పరిస్థితిలో, పురుషులు ఆ కోచ్‌లోకి ప్రవేశించకుండా ఉండాలి. లేకుంటే వారికి భారీగా జరిమానా పడుతుంది.

తెల్లటి చారలు ఎందుకు వేస్తారంటే?

బ్లూ కలర్ కోచ్‌లో తెల్లటి రంగు చారలు కనిపిస్తే, అది సాధారణ కోచ్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఇటువంటి కోచ్‌లు సాధారణంగా రైలు, వెనుక భాగంలో ఉంటాయి. కన్ఫర్మ్ సీటు పొందలేని వారు ఈ కోచ్‌లలో ప్రయాణిస్తారు.

పసుపు గీతల అర్థం ఏంటంటే?

నీలం రంగు కోచ్‌లో, బయటి అంచున పసుపు రంగుతో చారలు వేస్తే, ఆ కంపార్ట్‌మెంట్‌లో వికలాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు కూడా ప్రయాణించవచ్చని అర్థం. ఇటువంటి కోచ్‌లలో, వికలాంగులు, రోగుల కోసం ప్రత్యేక సీటు, టాయిలెట్ సౌకర్యం ఉంటుంది.

Tags:    

Similar News