Budget Process: దేశ బడ్జెట్‌ ఎవరు తయారుచేస్తారో తెలుసా..పూర్తి ప్రక్రియని తెలుసుకోండి..!

Budget Process: బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

Update: 2023-01-27 09:30 GMT

Budget Process: దేశ బడ్జెట్‌ ఎవరు తయారుచేస్తారో తెలుసా..పూర్తి ప్రక్రియని తెలుసుకోండి..!

Budget Process: బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈ బడ్జెట్‌ రూపొందించే అధికారులు ఎవరనేది చాలామందికి తెలియదు. వాస్తవానికి బడ్జెట్‌ను కొంతమంది IAS-IRS, సీనియర్ అధికారులు కలిసి రెడీ చేస్తారు. సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అధికారులు జిల్లా లేదా రాష్ట్రాల్లో పని చేస్తారు. ఆ తర్వాత సీనియారిటీ స్థాయిలో కేంద్ర మంత్రివర్గంలో పని చేసేందుకు వస్తారు. అక్కడ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు మాత్రమే బడ్జెట్‌కు తుది రూపం ఇస్తారు.

మీరు దేశం కోసం బడ్జెట్ తయారు చేయాలని కలలుగన్నట్లయితే సివిల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. దీని కోసం ప్రతి సంవత్సరం UPSC సివిల్ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్ష మూడు దశల్లో జరుగుతుంది. అందులో మొదటిది ప్రిలిమ్స్‌, రెండోది మెయిన్స్‌, మూడోది ఇంటర్వూ. తర్వాత తుది ఫలితాలు ప్రకటిస్తారు. ఇందులో వచ్చిన ర్యాంకుని బట్టి అధికారుల ఎంపిక జరుగుతుంది. ఇందులో ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌, ఇంకా చాలా సర్వీసులు ఉంటాయి. ఈ అధికారులు సీనియారిటీ ఆధారంగా వివిధ మంత్రిత్వ శాఖలకి చేరుకుంటారు. అందులో ఆర్థిక శాఖకి చేరిన సీనియర్‌ అధికారులు బడ్జెట్‌ సిద్ధం చేస్తారు. ఈ ఏడాది బడ్జెట్‌ను సిద్ధం చేస్తున్న ఐఏఎస్‌లు ఎవరో తెలుసుకుందాం.

ఆర్థిక కార్యదర్శి TV సోమనాథన్ తమిళనాడు కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ IAS అధికారి. 2015 నుంచి 2017 వరకు ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేశారు. ఆర్థికశాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందారు. ఇది కాకుండా అతను చార్టర్డ్ అకౌంటెంట్ (CA), కాస్ట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ (CS) కూడా. అజయ్ సేథ్ కూడా ఐఏఎస్. G20 సెంట్రల్ బ్యాంక్, ఆర్థిక మంత్రి సమావేశాల సహ-ఛైర్మన్‌షిప్‌కు బాధ్యత వహిస్తారు. తుహిన్ కాంత పాండే, సంజయ్ మల్హోత్రా లాంటి ఐఏఎస్‌ అధికారులు ఉన్నారు.

Tags:    

Similar News