మీ దగ్గర రూ.100, 200, 500 చిరిగిన నోట్లు ఉన్నాయా.. ఈ విధంగా మార్చుకోండి..!

Currency Notes Exchange: కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది.

Update: 2023-02-03 09:32 GMT

మీ దగ్గర రూ.100, 200, 500 చిరిగిన నోట్లు ఉన్నాయా.. ఈ విధంగా మార్చుకోండి..!

Currency Notes Exchange: కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. నోట్ల రద్దు తర్వాత సోషల్‌ మీడియాలో అనేక నకిలీ వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటిని ఎప్పుడు నమ్మవద్దు. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇందులో మీరు సరికొత్త నోట్లను పొందుతారు. ఈ నోట్లకు సంబంధించిన సమాచారాన్ని బ్యాంకు ట్వీట్ చేయడం ద్వారా తెలిపింది. మీరు పాత లేదా మ్యుటిలేటెడ్ నోట్లను మార్చుకోవాలనుకుంటే సులభంగా చేయవచ్చు. మీరు దగ్గరలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించవచ్చు. ఇక్కడ నోట్లు, నాణేలను సులభంగా మార్చుకోవచ్చు.

రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనల ప్రకారం.. మీ దగ్గర పాత లేదా మ్యుటిలేటెడ్ నోట్లు ఉంటే మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులోని ఏదైనా శాఖకి వెళ్లి నోట్లను మార్చుకోవచ్చు. ఇలాంటి నోట్లని మార్చుకోవడానికి ఎవరైనా బ్యాంకు ఉద్యోగి నిరాకరిస్తే మీరు దీనిపై ఫిర్యాదు చేయవచ్చు. నోటు పరిస్థితి అధ్వాన్నంగా ఉంటే దాని విలువ తగ్గుతుందని గుర్తుంచుకోండి.

ఆర్బీఐ ప్రకారం చిరిగిన నోటులో కొంత భాగం తప్పిపోయినప్పుడు లేదా రెండు ముక్కల కంటే ఎక్కువ ముక్కలైనప్పుడు, ఒకదానితో ఒకటి అతికించి ఉన్ననోట్లని మార్చుకోవచ్చు. కరెన్సీ నోటులోని కొన్ని ప్రత్యేక భాగాలు అంటే సంతకం, అశోక స్తంభం, మహాత్మా గాంధీ చిత్రం, వాటర్ మార్క్ లేకుంటే అలాంటి నోట్లని మార్చుకోవడానికి కుదరదు. చాలా కాలంగా మార్కెట్‌లో చలామణిలో ఉండడంతో నిరుపయోగంగా మారిన నాసిరకం నోట్లను కూడా మార్చుకునే అవకాశం ఉంది.

అయితే బాగా కాలిపోయిన నోట్లను బ్యాంకు తీసుకోదు. వీటిని ఆర్‌బిఐ ఇష్యూ కార్యాలయానికి తీసుకెళ్లాలి. నోట్‌కు జరిగిన నష్టం నిజమైనదేనని ఆర్బీఐ గుర్తిస్తే వాటిని మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే బ్యాంకు సంఘటనకి సంబంధించి విచారణ చేస్తుందని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News