Indian Railway: టికెట్ బుకింగ్ సమయంలో ఈ చిన్న పని చేయండి.. 10 లక్షల వరకు కవరేజీ..!
Indian Railway: ఇటీవల ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంతో చాలామంది ప్రయాణికులు అలర్ట్ అయ్యారు.
Indian Railway: టికెట్ బుకింగ్ సమయంలో ఈ చిన్న పని చేయండి.. 10 లక్షల వరకు కవరేజీ..!
Indian Railway: ఇటీవల ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంతో చాలామంది ప్రయాణికులు అలర్ట్ అయ్యారు. జూన్ 2న జరిగిన ఈ ప్రమాదంలో 261 మంది ప్రాణాలు కోల్పోయారు. 900 మంది గాయపడ్డారు. అయితే ఇండియన్ రైల్వే ప్రయాణికులకి 10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం అందిస్తోంది. దీని గురించి చాలామంది ప్రయాణికులకి తెలియదు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైల్వే టికెట్ బుకింగ్‌లో అనేక మార్పులు వచ్చాయి. ఈ రోజుల్లో చాలామంది రైల్వే స్టేషన్‌లోని టికెట్ కౌంటర్ నుంచి కాకుండా IRCTC ద్వారా టికెట్ బుక్ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఒక చిన్న పనిచేస్తే మీకు 10 లక్షల ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. దాని గురించి తెలుసుకుందాం.
రూ.10 లక్షల బీమా
IRCTC టిక్కెట్ బుకింగ్ సమయంలో ప్రయాణీకులకు బీమా సౌకర్యాన్ని అందిస్తుంది. ప్రమాదకరమైన సంఘటనలు జరిగినప్పుడు సదరు బీమా కంపెనీ ప్రయాణికులకు నష్టాన్ని భర్తీ చేస్తుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఒక్కో ప్రయాణికుడికి కేవలం 35 పైసలతో రూ.10 లక్షల వరకు బీమాను అందిస్తోంది. ప్రమాదంలో వేర్వేరు అర్హతలను బట్టి గాయపడిన వారికి, మరణించిన వారి కుటుంబ సభ్యులకు సహాయం మొత్తాన్ని అందిస్తుంది. ఈ పరిస్థితిలో టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు తప్పనిసరిగా ప్రయాణ బీమా ఎంపికను ఎంచుకోవాలి.
ప్రయాణ బీమాను ఎలా ఎంచుకోవాలి..?
IRCTC ద్వారా టిక్కెట్లను బుక్ చేసే సమయంలో ప్రయాణీకులు ప్రయాణ బీమాను ఎంచుకోవడానికి ఒక ఎంపికను అందిస్తుంది. దీనిని ఎంచుకోవడంతో ఇ మెయిల్, మొబైల్ నంబర్‌కు ఒక లింక్ వస్తుంది. ఈ లింక్‌పై క్లిక్ చేసి వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి అందులో పేరు, మొబైల్ నంబర్, వయస్సు, సంబంధం వంటి నామినీ వివరాలని అందించాలి. తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే బాధిత ప్రయాణీకుడు లేదా నామినీ ఈ బీమా పాలసీని క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఎంత మొత్తం లభిస్తుంది..?
1. రైలు ప్రమాదంలో ప్రయాణికుడు మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల సాయం అందుతుంది.
2. ప్రమాదంలో ప్రయాణికుడు పూర్తిగా అంగవైకల్యం చెందితే అతనికి రూ.10 లక్షల బీమా క్లెయిమ్ వస్తుంది.
3. మరోవైపు పాక్షిక శాశ్వత వైకల్యం ఏర్పడితే రూ.7.5 లక్షల సాయం అందజేస్తారు.
4. గాయపడిన వ్యక్తికి రూ.2 లక్షల క్లెయిమ్ అందుతుంది.
5. ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అతని కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేస్తారు.
బీమాను ఎలా క్లెయిమ్ చేయాలి..?
రైలు ప్రమాదం సంభవించినప్పుడు బాధిత వ్యక్తి లేదా నామినీ ఈ బీమా కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా భీమా సంస్థ కార్యాలయానికి వెళ్లాలి. తర్వాత కంపెనీ క్లెయిమ్‌కి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. నామినీ లేదా ప్రయాణీకుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, హాస్పిటల్ బిల్లు లేదా డెత్ సర్టిఫికేట్ వంటి పత్రాలను సమర్పించాలి. ప్రమాదం జరిగిన నాలుగు నెలలలోపు ఈ క్లెయిమ్ చేయాలని గుర్తుంచుకోండి.