Pan Card: పాన్‌కార్డుదారులు పొరపాటున ఈ తప్పు చేయకండి.. 10,000 వేల జరిమానా..!

Pan Card: పాన్‌కార్డుదారులు పొరపాటున ఈ తప్పు చేయకండి.. 10,000 వేల జరిమానా..!

Update: 2022-03-14 05:30 GMT

Pan Card: పాన్‌కార్డుదారులు పొరపాటున ఈ తప్పు చేయకండి.. 10,000 వేల జరిమానా..!

Pan Card: నేటి కాలంలో పాన్ కార్డ్ తప్పనిసరి. ఇది లేకుండా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరగవు. బ్యాంకులో ఖాతా తెరవడం నుంచి ప్రతి ఆర్థిక లావాదేవీ దీనితో ముడిపడి ఉంటుంది. పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడం ఇప్పుడు తప్పనిసరి అయింది. ముందుగా దీని చివరి తేదీ 30 సెప్టెంబర్ 2021, ఇది 31 మార్చి 2022కి పెంచారు. అయినా కూడా లింక్ చేసుకోనట్లయితే పాన్కార్డుకు సంబంధించిన పొరపాటుకు రూ.10,000 జరిమానా విధించవచ్చు.

మీరు పాన్ నంబర్‌ను ఎంటర్ చేసేటప్పుడు పది అంకెల నంబర్‌ను చాలా జాగ్రత్తగా నింపండి. దీనిలో ఏదైనా తప్పు పోయినట్లయితే భారీ పెనాల్టీ ఉంటుంది. దీంతో పాటు రెండు పాన్ కార్డులు ఉన్నా కూడా పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించాల్సి రావచ్చు. ఇది మీ బ్యాంక్ ఖాతాను స్తంభింపజేయవచ్చు. అందువల్ల మీరు రెండు పాన్ కార్డులను కలిగి ఉంటే వెంటనే మీ రెండో పాన్ కార్డును డిపార్ట్‌మెంట్‌కు సరెండర్ చేయాలి. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 272బిలో దీనికి సంబంధించిన నిబంధన ఉంది.

పాన్‌ను సరెండర్ చేసే ప్రక్రియ చాలా సులభం. దీని కోసం మీరు పూరించవలసిన సాధారణ ఫారమ్ ఒకటి ఉంది. దీని కోసం మీరు ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌కి వెళ్లండి. 'కొత్త పాన్ కార్డ్ కోసం అభ్యర్థన లేదా పాన్ డేటాలో మార్పులు లేదా సవరణ' లింక్‌పై క్లిక్ చేయండి. ఫారమ్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి. తర్వాత ఏదైనా NSDL కార్యాలయానికి వెళ్లి సమర్పించండి. రెండో పాన్ కార్డ్‌ను సరెండర్ చేస్తున్నప్పుడు ఫారమ్‌తో పాటు దానిని సమర్పించండి. మీరు దీన్ని ఆన్‌లైన్‌లో కూడా చేయవచ్చు.

Tags:    

Similar News