Portable Dryer: వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరడం లేదా.. ఈ పోర్టబుల్ డ్రైయర్‌తో ముక్క వాసనకు చెక్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Portable Dryer: వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరడం లేదా.. ఈ పోర్టబుల్ డ్రైయర్‌తో ముక్క వాసనకు చెక్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Portable Dryer: వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరడం లేదా.. ఈ పోర్టబుల్ డ్రైయర్‌తో ముక్క వాసనకు చెక్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Portable Dryer: ప్రస్తుతం భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల వరద పరిస్థితి కూడా ఏర్పడుతోంది. ఇటువంటి పరిస్థితిలో, సూర్యకాంతి లేకపోవడం వల్ల, చాలా తేమగా కూడా ఉంటుంది. దీని వల్ల బట్టలు కూడా త్వరగా ఎండకపోవడం వల్ల.. ముక్క వాసన వస్తుంటాయి. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, ఈ న్యూస్ మీకోసమే.
వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడం చాలా కష్టమైన పని. రోజువారీ జీవితంలో మనం రోజూ బట్టలు మారస్తుంటాం. కానీ, సూర్యరశ్మి లేకపోవడంతో బట్టలు సరిగ్గా ఆరవు. ముఖ్యంగా జీన్స్ వంటి మందపాటి బట్టలు ఆరబెట్టడం చాలా కష్టమైన పని. అదేవిధంగా అండర్ గార్మెంట్ సరిగా ఆరకపోతే ఎలర్జీ, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టేందుకు వాషింగ్ మెషీన్‌లోని డ్రైయర్‌ని వాడుతుంటాం. ఇది పెద్ద కుటుంబానికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ డ్రైయర్ యంత్రాలు చాలా శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాయి. అవి చాలా ఖరీదైనవి. కానీ, ఇప్పుడు చెప్పబోయే మెషీన్ మాత్రం చాలా పోర్టబుల్, చాలా కాంపాక్ట్‌గా ఉంది.
అమెజాన్ నుంచి ఈ మెషీన్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు. దాని పేరు DMR-DO-55A సెమీ-ఆటోమేటిక్ 5 కిలోల స్పిన్ డ్రైయర్. ఇది కేవలం రూ.5,799కి కొనుగోలు చేయవచ్చు. ఇందులో కేవలం డ్రైయర్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇది వాషింగ్ మెషీన్ నుంచి భిన్నంగా ఉంటుంది. ఇది బట్టలు ఆరబెట్టడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.
ఈ టాప్ లోడ్ డ్రైయర్ మెషిన్ కెపాసిటీ 5 కిలోలు. దీని మోటారు 320W. మీ ఇంట్లో డ్రైయర్ లేకుండా వాషింగ్ మెషీన్ ఉంటే, మీరు దానిని కొనుగోలు చేయవచ్చు. మీకు వాషింగ్ మెషీన్ లేకపోతే, బట్టలు ఉతికిన తర్వాత ఆరబెట్టడానికి దీనిని వాడుకోవచ్చు.