Post Office: పోస్టాఫీస్‌ ఎఫ్‌డీపై ఎక్కువ రాబడి.. కొత్త ధరలని చెక్‌ చేయండి..!

Post Office: పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టడం లాభదాయకమైన, సురక్షితమైన పెట్టుబడి.

Update: 2022-06-09 13:00 GMT

Post Office: పోస్టాఫీస్‌ ఎఫ్‌డీపై ఎక్కువ రాబడి.. కొత్త ధరలని చెక్‌ చేయండి..!

Post Office: పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టడం లాభదాయకమైన, సురక్షితమైన పెట్టుబడి. మీరు మరింత డబ్బు సంపాదించాలనుకుంటే పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్ ఖాతాలో డిపాజిట్‌ చేయవచ్చు. అలాగే మీరు పోస్టాఫీసులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసినప్పుడు మరిన్ని ప్రయోజనాలను పొందుతారు. ప్రభుత్వ గ్యారంటీతో పాటు మంచి రాబడులని సంపాదిస్తారు. పోస్టాఫీసులో FD పొందడం చాలా సులభం. రెండు పథకాలు ఒకటి పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్, రెండు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఈ రెండు పథకాలలో పెట్టుబడిపై ఆదాయపు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.

మీరు పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పరిశీలిస్తే మీకు 1 సంవత్సరం వడ్డీ రేటు 5.50 శాతం, 2 సంవత్సరాల వడ్డీ రేటు 5.50 వడ్డీ రేటు, 3 సంవత్సరాల వడ్డీ రేటు 5.5 శాతం, 5 సంవత్సరాల వడ్డీ రేటు 6.7 శాతం లభిస్తుంది. వడ్డీ వార్షికంగా చెల్లిస్తారు. కానీ త్రైమాసికంలో లెక్కిస్తారు. మీరు FDలో కనీసం 1000 రూపాయలు డిపాజిట్‌ చేయవచ్చు. దీనికి గరిష్ట పరిమితి లేదు. 5 సంవత్సరాలు డిపాజిట్‌ చేసే పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS): ఈ పథకం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ (60 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ) కోసం రూపొందించారు. ఈ పథకం డిపాజిటర్లకు సంవత్సరానికి 7.4% వడ్డీని అందిస్తుంది. వడ్డీని త్రైమాసిక ప్రాతిపదికన చెల్లించాలి. మీరు రూ. 1,000తో ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే గరిష్ట మొత్తం రూ. 15 లక్షలు.

50 సంవత్సరాల కంటే ఎక్కువ, 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న రిటైర్డ్ డిఫెన్స్ సిబ్బంది అందరూ 55 ఏళ్లు పైబడిన మరియు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న రిటైర్డ్ సివిల్ సర్వెంట్లందరికీ ఈ పథకం బెస్ట్ అని చెప్పవచ్చు. పోస్టాఫీసులో FD చేస్తే డబ్బు సురక్షితంగా ఉంటుంది. ఆఫ్‌లైన్ (నగదు, చెక్కు) లేదా ఆన్‌లైన్ (నెట్ బ్యాంకింగ్ / మొబైల్ బ్యాంకింగ్)లో FD చేయవచ్చు. ఇందులో ఒకటి కంటే ఎక్కువ FD చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు ఉమ్మడి ఖాతాను ఓపెన్‌ చేయవచ్చు. మీరు 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో పన్ను మినహాయింపు లభిస్తుంది.

Tags:    

Similar News