ఈనెల లో 8 రోజులు బ్యాంకులకు సెలవు!

డిసెంబర్ నెలలో బ్యాంకులకు మొత్తం 8 సెలవురోజులున్నాయి.

Update: 2019-12-01 04:47 GMT
December Bank Holidays

అందరికీ బ్యాంకులతో నిత్యం పని ఉంటుంది. ఒక్కరోజు బ్యాంక్ కు సెలవు వచ్చినా ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఒక్కోసారి బ్యాంక్ సెలవు తెలీకపోవడం వలన ముఖ్యమైన లావాదేవీల విషయంలో ఇక్కటలకు గురయ్యే అవకాశమూ ఉంటుంది. సాధారణంగా బ్యాంకులకు ఆదివారం సెలవు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక రెండు, నాలుగు శని వారాలు కూడా సెలవు రోజులే. ఈ సెల్లవులే కాకుండా అదనంగా పండగలు, కొన్ని ప్రత్యేక సందర్భాలలో బ్యాంకులకు సెలవులు ప్రకటిస్తారు. జాతీయ స్థాయిలో సెలవులు ప్రకటించిన రాష్ట్రాలను బట్టి కూడా ఒక్కోసారి కొన్ని సెలవులు పెరగడం జరగొచ్చు. ప్రతి నెలా ఆ నెలలో వచ్చే బ్యాంక్ సెలవులు తెలుసుకోవడం వలన లావాదేవీల విషయంలో జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది.

తెలుగురాష్ట్రాల్లో  డిసెంబర్ నెల బ్యాంక్ సెలవులు ఇవే..

డిసెంబర్ నెలలో 5 ఆదివారాలు వచ్చాయి. అవి 1, 8, 15, 22, 29 తేదీలు. ఇక రెండు రెండో శనివారాలు 14, 28 తేదీలలో వచ్చాయి. అంటే మొత్తం 7 సెలవు దినాలు మామూలుగానే ఉన్నాయి. ఇక అదనంగా ఈ నెలలో క్రిస్మస్ పండుగ ఉంది. డిసెంబర్ 25 క్రిస్మస్ సెలవు. ఇది జాతీయ సెలవు దినం. దీంతో కలిపి మొత్తం 8 సెలవు దినాలు ఉన్నాయి. మొత్తంగా 1, 8, 14, 15, 22, 25, 28, 29 తేదీలు బ్యాంకులకు సెలవులు. వినియోగదారులు ఈ తేదీలను గమనించి తమ లావాదేవీలను ప్లాం చేసుకోవచ్చు.

Tags:    

Similar News