Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్​.. డీఏ 4శాతం పెంపు..!

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2023-04-07 01:00 GMT

Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్​.. డీఏ 4శాతం పెంపు..!

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. డీఏను 4శాతం పెంచుతూ... కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం 38 శాతంగా ఉన్న డీఏ 42 శాతానికి పెరగనుంది. ఈ మేరకు కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వంపై 12 వేల 815 కోట్ల భారం పడనున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు.

మరోవైపు వంట గ్యాస్, సీఎన్జీ ధరలు సైతం తగ్గనున్నాయి. అంతర్జాతీయ ధరలతో సంబంధం లేకుండా గ్యాస్ ధరలు భారతీయ క్రూడ్ మార్కెట్‌తో అనుసంధానం కానున్నాయి. సహజ వాయువు ధర భారతీయ క్రూడ్ బాస్కెట్ నెలవారీ సగటులో పది శాతం ఉంచాలని నిర్ణయించింది. స్థిరమైన ధరను నిర్ధారించడానికి కొత్త విధానాన్ని అమలు చేయనుంది. దీంతో నెలవారీగా గ్యాస్ రేట్ల నిర్ణయించనున్నారు. ప్రతికూల మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి ప్రజలకు, ఉత్పత్తిదారులకు ఉపశమనం అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Tags:    

Similar News