వారికి మరొక అవకాశం.. అక్టోబర్‌ 31 చివరితేదీ..!

Income Tax: ప్రతి సంవత్సరం ప్రజలు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలి.

Update: 2022-08-01 13:00 GMT

వారికి మరొక అవకాశం.. అక్టోబర్‌ 31 చివరితేదీ..!

Income Tax: ప్రతి సంవత్సరం ప్రజలు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలి. ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వం సమయం ఇస్తుంది. ఈ సమయంలోగా ప్రజలు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయాలి. కానీ కొంతమంది నిర్ణీత తేదీలోగా కూడా ఐటీఆర్‌ దాఖలు చేయలేరు. తర్వాత వారు పెనాల్టీని భరించవలసి ఉంటుంది.

2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి చివరి తేదీ 31 జూలై 2022 ఆదివారం. ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం లేని పన్ను చెల్లింపుదారులు ఈ తేదీలోపు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయాలి. లేదంటే రూ. 5000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జీతం పొందే వ్యక్తులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌ను జూలై 31వ తేదీలోపు దాఖలు చేయాల్సి ఉంటుంది.

అయితే కార్పొరేట్‌లు లేదా వారి ఖాతాలను ఆడిట్ చేయాల్సిన వారు అక్టోబర్ 31 నాటికి తమ రిటర్న్‌లను ఫైల్ చేయవచ్చు. ఈ వ్యక్తులు అక్టోబర్ 31 వరకు ఎటువంటి జరిమానాను ఎదుర్కోరు. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపులకి 2021-22 ఆర్థిక సంవత్సరానికి చివరి తేదీ జూలై 31. చివరి రోజైన ఆదివారం రాత్రి 10 గంటల వరకు 63.47 లక్షలకు పైగా రిటర్నులు సమర్పించారు. ఆలస్య రుసుము భారాన్ని నివారించడానికి పన్ను చెల్లింపుదారులు నిర్ణీత సమయంలోగా రిటర్న్‌లను దాఖలు చేయాలని డిపార్ట్‌మెంట్ నిరంతరం అభ్యర్థిస్తోంది. అంతకుముందు జూలై 30 వరకు 5.10 కోట్లకు పైగా రిటర్నులు దాఖలయ్యాయి.

Tags:    

Similar News