Bank Account: మీ బ్యాంక్ ఖాతాను వాడడం లేదా.. అయితే వెంటనే క్లోజ్ చేయండి.. లేదంటే తీవ్ర నష్టం..!

Bank Account: చాలా సార్లు మనం వేర్వేరు పనుల కోసం వేర్వేరు బ్యాంకు ఖాతాలను తెరుస్తుంటాం...

Update: 2022-01-09 06:14 GMT

Bank Account: మీ బ్యాంక్ ఖాతాను వాడడం లేదా.. అయితే వెంటనే క్లోజ్ చేయండి.. లేదంటే తీవ్ర నష్టం..!

Bank Account: చాలా సార్లు మనం వేర్వేరు పనుల కోసం వేర్వేరు బ్యాంకు ఖాతాలను తెరుస్తుంటాం. ఉద్యోగం మారి, ఊరు వదిలి బదిలీపై వెళ్లే వారు చాలా మంది ఉంటారు. దీంతో చాలాసార్లు బ్యాంకు ఖాతా మార్చుకోవాల్సి వస్తోంది. బదిలీ జరిగే నగరంలో కొత్త ఖాతాను తీసుకుంటుంటారు.

చాలా సార్లు, ఖాతాను ఉపయోగించని పక్షంలో, ఈ ఖాతా సేవింగ్స్ ఖాతాగా మార్చుతారు. ఇందులో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుకోనందుకు కస్టమర్లు చాలాసార్లు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. అటువంటి పరిస్థితిలో, వీలైనంత త్వరగా ఈ బ్యాంక్ ఖాతాలను క్లోజ్ చేయాల్సిన సరిస్థితి వస్తుంది.

ఈ విధంగా ఖాతాను క్లోజ్ చేయండి..

మీరు కూడా ఉపయోగంలో లేని ఖాతాను కలిగి ఉంటే మాత్రం వెంటనే క్లోజ్ చేసుకోవడం మంచింది. లేదంటే అదనపు ఛార్జీలను చెల్లించవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఈ పని చేయని బ్యాంకు ఖాతాలను వీలైనంత త్వరగా మూసివేసుకోవడం మంచింది. మీరు ఒక ఖాతాను ఉంచుకుని, మిగిలిన అన్ని ఖాతాలు వాడకుండా ఉంటే, పనిచేయని ఖాతాలో ఉన్న డబ్బును ప్రధాన ఖాతాలోకి పంపించుకోవడం మంచింది. మీరు ATM లేదా ఆన్‌లైన్ బదిలీ సహాయంతో కూడా ఈ పనిని చేయవచ్చు. దీని తర్వాత, ఖాతాకు లింక్ చేసిన అన్ని డెబిట్‌లను డీలింక్ చేయండి. ఆ తరువాత వాటిని తొలగించండి.

మీరు ఖాతాను తెరిచిన 14 రోజులలోపు మూసివేస్తే, మీరు ఎలాంటి ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, మీరు ఒక సంవత్సరం తర్వాత ఖాతాను మూసివేస్తే, మీరు క్లోజింగ్ ఛార్జీని చెల్లించవలసి ఉంటుంది. అదే సమయంలో, ఒక సంవత్సరంలోపు క్లోజ్ చేస్తే కూడా ఎటువంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు.

ఖాతాను మూసివేయడానికి, మీరు మొదట ఆ బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఖాతా మూసివేత ఫారమ్‌ను పూరించాలి. దీని తర్వాత డీ-లింకింగ్ ఫారమ్‌ను కూడా సమర్పించాల్సి ఉంటుంది. దీనితో పాటు, అన్ని చెక్ బుక్‌లు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు కూడా బ్యాంకుకు అందించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News