గ్యాస్ ధర రూ.200 తగ్గింపు.. దేశంలో భారీగా తగ్గనున్న సిమెంట్, స్టీల్ ధరలు..
Nirmala Sitharaman: ప్రజలకు కేంద్రం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
గ్యాస్ ధర రూ.200 తగ్గింపు.. దేశంలో భారీగా తగ్గనున్న సిమెంట్, స్టీల్ ధరలు..
Nirmala Sitharaman: ప్రజలకు కేంద్రం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. చమురుపై భారీగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. లీటర్ పెట్రోల్‌పై 8 రూపాయలు, లీటర్ డీజిల్‌పై 6 రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో రాష్ట్రాల్లో పెట్రోల్‌పై అదనంగా మరో రూపాయిన్నర అంటే 9 రూపాయల 50పైసలు, డీజిల్‌పై అదనంగా మరో రూపాయి అంటే 7 రూపాయలు తగ్గే అవకాశం ఉంది.
మరోవైపు వంటగ్యాస్ ధరనూ తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్దిదారులకు సిలిండర్‌కు 200 రూపాయల చొప్పున.. సబ్సిడీ 12 సిలిండర్ల వరకూ మాత్రమే ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సిమెంట్ లభ్యతను మెరుగుపరచడంతోపాటు మెరుగైన లాజిస్టిక్స్ ద్వారా సిమెంట్ ధరను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మరోవైపు ఐరన్, స్టీల్‌పై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తగ్గించింది. ప్లాస్టిక్ ఉత్పత్తులు, ముడి పదార్ధాలతోపాటు ఉక్కు ముడి పదార్ధాలపై దిగుమతి సుంకం తగ్గిస్తున్నట్లు తెలిపింది.