Farmers: రైతులకు శుభవార్త.. ఆ అద్భుత పథకాన్ని మరో 3 ఏళ్లు పొడిగించిన ప్రభుత్వం.. అదేంటంటే?

కేంద్ర మంత్రి వర్గం కీలక నిర‌్ణయం తీసుకుంది. యూరియా సబ్సిడీ (Urea Subsidy) పథకాన్ని మరింత కాలం కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది.

Update: 2023-06-29 09:50 GMT

Farmers: రైతులకు శుభవార్త.. ఆ అద్భుత పథకాన్ని మరో 3 ఏళ్లు పొడిగించిన ప్రభుత్వం.. అదేంటంటే?

Farmers: కేంద్ర మంత్రి వర్గం కీలక నిర‌్ణయం తీసుకుంది. యూరియా సబ్సిడీ (Urea Subsidy) పథకాన్ని మరింత కాలం కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది. మూడేళ్లపాటు అంటే 2022-23 నుంచి 2024-25 వరకు యూరియా సబ్సిడీ కంటిన్యూ చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపిందంట. యూరియా సబ్సిడీ కోసం రూ.3,68,676.7 కోట్లను కేటాయించిందంట. ఇది 2023-24 ఖరీఫ్ సీజన్ ఆమోదించిన సబ్సిడీ కాకుండా అదనంగా కేటాయించిందంట.

రైతుల కోసం ఇప్పటికే రూ.3.7 లక్షల కోట్లతో పలు పథకాలను ప్రారంభించనుందంట. అలాగే చెరుకు ధరలను కూడా క్వింటాల్‌కు రూ.10 పెంచింది. చక్కెర సీజన్‌ మొదలయ్యే క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుందంట. ఈ నిర్ణయంతో 5 కోట్లకు పైగా చెరుకు రైతులతోపాటు ఈ పరిశ్రమపై ఆధారపడిన ఇతరులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. తాజా నిర్ణయంతో యూరియా ఒక బ్యాగ్‌కు రూ.242 చొప్పున కొనుగోలు చేయోచ్చు. భూమిలో సల్ఫర్ లోపం నివారించేందుకు అన్నదాతలకు ఇన్‌పుట్ సబ్సిడీ ఖర్చులను తగ్గించేందుకు కేబినెట్ సల్ఫర్-కోటెడ్ యూరియా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

Tags:    

Similar News