Fixed Deposit: పాత ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ బ్రేక్‌ చేసి కొత్తగా చేయవచ్చా.. ఏది సరైనదో తెలుసుకోండి..!

Fixed Deposit: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)గత నెలల్లో రెపో రేటును పదేపదే పెంచింది.

Update: 2022-12-24 09:37 GMT

Fixed Deposit: పాత ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ బ్రేక్‌ చేసి కొత్తగా చేయవచ్చా.. ఏది సరైనదో తెలుసుకోండి..!

Fixed Deposit: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)గత నెలల్లో రెపో రేటును పదేపదే పెంచింది. దీంతో బ్యాంకులు గత కొన్ని నెలలుగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. రెండు సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ఇప్పుడు 6.75 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. మీరు సీనియర్ సిటిజన్ అయితే చిన్న ఫైనాన్స్ బ్యాంక్‌లో సరైన FDని ఎంచుకోవడం వల్ల 9% కంటే ఎక్కువ వడ్డీని పొందవచ్చు.

సుమారు ఎనిమిది నెలల క్రితం ఎఫ్డీలలోపెట్టుబడి పెట్టినవారు అతి తక్కువ వడ్డీని పొందుతున్నారు. ఈ పరిస్థితిలో చాలా మంది అప్పటి FD మొత్తాన్ని విత్‌ డ్రా చేసి కొత్తగా అధిక వడ్డీ రేటుతో ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేయాలని అనుకుంటున్నారు. అయితే పాత FDని విత్‌ డ్రా చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన మూడు విషయాలు ఉన్నాయి. ముందుగా ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యూరిటీ ఎప్పుడు. రెండవది FDని విత్‌ డ్రా చేయడానికి అయ్యే ఖర్చు ఎంత..? మూడవది మీరు కొత్త FDపై ఎంత అదనపు వడ్డీని పొందుతున్నారు. ఈ లెక్కలు చూసుకోవాలి.

ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యూరిటీకి దగ్గరగా ఉన్నట్లయితే దానిని విత్‌ డ్రా చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే దీనివల్ల తక్కువ వడ్డీ రేటును పొందుతారు. ఇది కాకుండా అకాల పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ పెనల్టీ బ్యాంకు నుంచి బ్యాంకుకు భిన్నంగా ఉంటుంది. ఇది 0.5 శాతం నుంచి 1 శాతం మధ్య ఉంటుంది. అదనపు రాబడి, పెనాల్టీ రెండింటినీ భేరిజు వేసుకోవాలి. ఆ తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. లేదంటే చాలా నష్టపోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News