Rupee Value: రూపాయికి భారీ షాక్.. డాలర్‌తో పోలిస్తే రూ.90.43 వద్ద చారిత్రక కనిష్ఠానికి పతనం..కారణాలివే!

Rupee Value: భారతీయ రూపాయి డాలర్‌తో ₹90.43 వద్ద చారిత్రక కనిష్ఠానికి చేరింది.

Update: 2025-12-04 12:30 GMT

Rupee Value: రూపాయికి భారీ షాక్.. డాలర్‌తో పోలిస్తే రూ.90.43 వద్ద చారిత్రక కనిష్ఠానికి పతనం..కారణాలివే!

Rupee Value: భారతీయ రూపాయి డాలర్‌తో ₹90.43 వద్ద చారిత్రక కనిష్ఠానికి చేరింది. విదేశీ పెట్టుబడుల వెనుకడుగు, భారత్-అమెరికా వాణిజ్య వివాదాలు, RBI పాలసీ ప్రభావితం ఇందుకు ప్రభావితం చేశాయి. అంతర్జాతీయ విపణిలో భారతీయ రూపాయి పతనం కొనసాగుతోంది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఉత్పన్నమైన అనిశ్చితులు, విదేశీ పెట్టుబడుల వెనక్కి తగ్గడం, గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు రూపాయి మారకం విలువపై ప్రభావం చూపుతున్నాయి.

ఇవాళ ట్రేడింగ్‌లో రూపాయి డాలర్‌తో పోలిస్తే 28 పైసలు పడిపోయి ₹90.43 వద్ద స్థిరపడింది. క్రితం సెషన్‌లో రూపాయి ₹90.15 వద్ద ముగిసింది. మార్కెట్ విశ్లేషకులు ఈ క్షీణత కొన్ని రోజులు కొనసాగవచ్చని, రూపాయి ₹90.70–91 మధ్య స్థిరపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని నెలలుగా విదేశీ పెట్టుబడులు భారత ఈక్విటీ మరియు డెట్ మార్కెట్ల నుండి వెనక్కి తీసుకోవడం రూపాయి పతనానికి ప్రధాన కారణంగా మారింది. అదనంగా, దిగుమతిదారులు వస్తువుల చెల్లింపుల కోసం భారీగా డాలర్లను కొనుగోలు చేయడం రూపాయి విలువపై ఒత్తిడి పెంచుతోంది.

Tags:    

Similar News