రెపో రేటు తగ్గింపు: వాహన–గృహ రుణదారులకు ఊరట

భారత రిజర్వ్‌ బ్యాంకు వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడానికి రెపో రేటును 0.25% తగ్గిస్తూ, ద్రవ్య పరపతి కమిటీ (MPC) ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో రెపో రేటు 5.50% నుంచి 5.25% కు చేరింది.

Update: 2025-12-05 06:10 GMT

రెపో రేటు తగ్గింపు: వాహన–గృహ రుణదారులకు ఊరట

భారత రిజర్వ్‌ బ్యాంకు వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడానికి రెపో రేటును 0.25% తగ్గిస్తూ, ద్రవ్య పరపతి కమిటీ (MPC) ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో రెపో రేటు 5.50% నుంచి 5.25% కు చేరింది.

ఆర్‌బీఐ కొత్త నిర్ణయాలు – ప్రధాన అంశాలు

0.25% రెపో రేటు తగ్గింపు

ఆర్థిక వ్యవస్థలోకి ₹1 లక్ష కోట్లు ప్రవాహం

ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ల ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు

$5 బిలియన్ డాలర్–రూపాయి స్వాప్ ఏర్పాటు

జీడీపీ వృద్ధి అంచనాను 7.3% కు పెంపు

విదేశీ మారక నిల్వలు $686 బిలియన్ రికార్డు స్థాయికి చేరిక

గవర్నర్ సంజయ్ మల్హోత్రా వ్యాఖ్యలు

ఆర్థిక వ్యవస్థలో liquidity పెంచడానికి ఆర్‌బీఐ మరిన్ని చర్యలు చేపడుతుందని,

ద్రవ్యోల్బణం 1.7% కు తగ్గడంతో వడ్డీ కోతకు అవకాశం కలిగిందని,

ప్రస్తుత ఆర్థిక త్రైమాసికంలో 8.2% వృద్ధి 'Golden Period' గా చెప్పవచ్చని పేర్కొన్నారు.

జాతీయ, అంతర్జాతీయ అనిశ్చితులు ప్రపంచ వాణిజ్యం, జియోపాలిటికల్ టెన్షన్స్—భారత ఆర్థిక వ్యవస్థపై ఇంకా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

వడ్డీ రేట్ల కోత – రుణదారులకు ప్రయోజనం

ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు కూడా హౌసింగ్, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రయోజనాలు వినియోగదారులకు ఎంత వేగంగా చేరతాయన్నది బ్యాంకుల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.

Tags:    

Similar News