Private Employees: ప్రైవేట్‌ ఉద్యోగులకి బంపర్ ఆఫర్.. వీటిని ఆదా చేయండి డబ్బులు పొందండి..!

Private Employees: ప్రైవేట్‌ ఉద్యోగులకి ఈ న్యూస్‌ శుభవార్తనే చెప్పాలి.

Update: 2023-02-09 02:45 GMT

Private Employees: ప్రైవేట్‌ ఉద్యోగులకి బంపర్ ఆఫర్.. వీటిని ఆదా చేయండి డబ్బులు పొందండి..!

Private Employees: ప్రైవేట్‌ ఉద్యోగులకి ఈ న్యూస్‌ శుభవార్తనే చెప్పాలి. సెలవులని పొదుపు చేసుకుంటే వాటికి డబ్బులు చెల్లిస్తారు. దీనినే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అంటారు. వాస్తవానికి ఉద్యోగులందరికీ సంవత్సరానికి కొన్ని లీవులు లభిస్తాయి. వీటిని సేవ్‌ చేసుకుంటే ఎంతో కొంత నగదు పొందవచ్చు. ఈ విషయం కంపెనీ హెచ్‌ ఆర్‌ని అడిగితే తెలుస్తుంది. అందుకే ఉద్యోగులు సెలవుల గురించి పూర్తి సమాచారాన్ని కలిగి ఉండటం అవసరం. ఒక సంవత్సరంలో గరిష్ట సంఖ్యలో సెలవులకి నగదు తీసుకోవచ్చు. తద్వారా మీరు బంపర్‌ ప్రయోజనం పొందుతారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023లో దాదాపు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు స‌హాయం అందించే ప్ర‌య‌త్నం చేశారు. ప్రయివేటు ఉద్యోగాలకి ఈసారి లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌లో భారీ మార్పులు చేసి ఉపశమనం అందించారు. అలాగే ప్రైవేట్ ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌లో పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని రూ.3 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ఒక వ్యక్తి మినహాయింపును 30-35 సంవత్సరాలకు పొడిగిస్తే అది సంవత్సరానికి రూ.20,000 కంటే ఎక్కువ అవుతుంది.

నిజానికి ఉద్యోగులకు అనేక రకాల సెలవులు లభిస్తాయి. వీటిలో క్యాజువల్ లీవ్, సిక్ లీవ్, పెయిడ్ లీవ్ మొదలైన సెలవులు ఉంటాయి. ఈ సెలవుల్లో కొన్ని నిర్ణీత సమయంలో తీసుకోకపోతే వాటి వ్యాలిడిటీ ముగుస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం కొన్ని సెలవులు కలుస్తాయి. ఉద్యోగి ఉద్యోగాలను మార్చినప్పుడు లేదా రిటైర్మెంట్‌ అయినప్పుడు కంపెనీ నుంచి మిగిలిన సెలవులను క్యాష్ చేసుకోవచ్చు. అంటే ఈ సెలవులకు కూడా డబ్బు తీసుకోవచ్చు. దీనినే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అంటారు.

Tags:    

Similar News