Union Budget 2026: పన్ను చెల్లింపుదారులకు నిర్మలమ్మ గుడ్ న్యూస్? బడ్జెట్‌లో ఇవే 5 కీలక ప్రకటనలు!

Union Budget 2026 : 2026 ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

Update: 2026-01-10 12:07 GMT

Union Budget 2026: పన్ను చెల్లింపుదారులకు నిర్మలమ్మ గుడ్ న్యూస్? బడ్జెట్‌లో ఇవే 5 కీలక ప్రకటనలు!

Union Budget 2026 : 2026 ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈసారి బడ్జెట్‌లో పన్ను సంస్కరణలకు ప్రభుత్వం పెద్దపీట వేయనున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, జీతభత్యాల ఉద్యోగులు, పెట్టుబడిదారులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా… పన్ను చెల్లింపుదారులకు బిగ్ రిలీఫ్ దక్కుతుందా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

గత బడ్జెట్లలో పన్ను చెల్లింపుదారులకు రిలీఫ్

గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పన్ను వ్యవస్థను సులభతరం చేసే దిశగా అడుగులు వేస్తోంది.

2020లో కొత్త ఆదాయపు పన్ను విధానం

ఆ తర్వాత స్టాండర్డ్ డిడక్షన్ పెంపు

2024లో క్యాపిటల్ గెయిన్స్ పన్ను నిబంధనల్లో మార్పులు

2025 బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా ప్రకటించడం

ఈ నిర్ణయాలు పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరటగా మారాయి.

క్రిప్టో పెట్టుబడిదారులకు ట్యాక్స్ రిలీఫ్ దక్కుతుందా?

2022 బడ్జెట్‌లో క్రిప్టో లావాదేవీలపై 1% TDS, లాభాలపై 30% ఫ్లాట్ ట్యాక్స్ విధించడం వల్ల ఈ రంగం తీవ్రంగా ప్రభావితమైంది. నష్టాలను లాభాలతో సర్దుబాటు చేసుకునే అవకాశం లేకపోవడంతో పెట్టుబడిదారులు నిరుత్సాహానికి గురయ్యారు.

ఈ నేపథ్యంలో 2026 బడ్జెట్‌లో

TDS రేటు తగ్గింపు

లేదా నష్టాల సర్దుబాటుకు అనుమతి

లాంటి కీలక మార్పులు వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లకు శుభవార్త?

ప్రస్తుతం దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను మినహాయింపు పరిమితి రూ.1.25 లక్షలుగా ఉంది. దీన్ని రూ.2 లక్షలకు పెంచే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

ఇలా జరిగితే చిన్న, మధ్యస్థ పెట్టుబడిదారులకు భారీ లాభం చేకూరడంతో పాటు మార్కెట్లలో పెట్టుబడులు పెరిగే అవకాశముంది.

కొత్త పన్ను విధానంలో మినహాయింపు పెంపు

కొత్త ఆదాయపు పన్ను విధానంలో ప్రస్తుతం రూ.4 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంది. దీనిని రూ.5 లక్షలకు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇది ముఖ్యంగా యువత, కొత్త విధానాన్ని ఎంచుకున్న ఉద్యోగులకు మేలు చేసే అంశంగా మారనుంది.

ఇన్సూరెన్స్ ప్రీమియాలపై కూడా డిడక్షన్?

కొత్త పన్ను విధానంలో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియాలపై కూడా మినహాయింపులు కల్పించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఇవి పాత విధానంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

కొత్త విధానంలోనూ 80C, 80D తరహా ప్రయోజనాలు వస్తే మరింత మంది కొత్త విధానానికి మారే ఛాన్స్ ఉంది.

డెట్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు కీలక బడ్జెట్

2023 తర్వాత డెట్ మ్యూచువల్ ఫండ్లపై పన్ను భారం పెరగడంతో పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గింది. 2026 బడ్జెట్‌లో ఈ నిబంధనలను సడలించి డెట్ ఫండ్లకు మళ్లీ ఆకర్షణ తీసుకురావాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తోందని తెలుస్తోంది.

మొత్తానికి…

2026 కేంద్ర బడ్జెట్ పన్ను చెల్లింపుదారులు, మధ్యతరగతి ప్రజలు, పెట్టుబడిదారులకు కీలకంగా మారనుంది. ఫిబ్రవరి 1న నిర్మలమ్మ చేసే ప్రకటనలు నిజంగా ఊరటనిస్తాయా? లేకపోతే అంచనాలకే పరిమితమవుతాయా? అన్నది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News