HDFC Bank New Rules: హెచ్‎డీఎఫ్‎సీ బ్యాంక్ వినియోగదారులకు బిగ్ షాక్..రేపటి నుంచి కొత్త రూల్స్

HDFC Bank New Rules: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన కస్టమర్లకు భారీ షాక్ ఇవ్వనుంది. బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ నిబంధనలను మార్చింది. ఈ కొత్త నిబంధనలు ఆగస్టు 1, 2024 నుండి అమలులోకి వస్తాయి. అంటే రేపటి నుంచి క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు ఖరీదుగా మారనున్నాయి. ఇష్ చేయడం ఖరీదుగా మారుతుంది.

Update: 2024-07-31 03:44 GMT

HDFC Bank New Rules: హెచ్‎డీఎఫ్‎సీ బ్యాంక్ వినియోగదారులకు బిగ్ షాక్..రేపటి నుంచి కొత్త రూల్స్

HDFC Bank New Rules:దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది. బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ నిబంధనలను మార్చేసింది. ఈ కొత్త నిబంధనలు ఆగస్టు 1, 2024 నుండి అమలులోకి వస్తాయి. అంటే రేపటి నుంచి క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయడం ఖరీదుగా మారుతుంది. HDFC బ్యాంక్ ఈ మార్పులు మీ క్రెడిట్ కార్డ్ వినియోగంపై భారీగా ప్రభావం పడుతుంది. ఇదివరకు మాదిరి ఇష్టం వచ్చినట్లు క్రెడిట్ కార్డు వాడేందుకు వీల్లేదు. ఎందుకంటే లావాదేవీలపై ఛార్జీల మోతా మోగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మంచిదని నిపుణులు భావిస్తున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్లాట్‌ఫారమ్‌లు: CRED, Cheq, MobiKwik, Freecharge అలాంటి ఇతర సేవలకు కొత్త నిబంధనలు వర్తిస్తాయి.

కొత్త ఛార్జ్: లావాదేవీ మొత్తంపై 1% ఛార్జీ, ఒక్కో లావాదేవీకి రూ.3000 లిమిట్.

ఇంధన లావాదేవీలు :

రూ.15,000 కంటే తక్కువగా ఉంటే ఎలాంటి అదనపు ఛార్జీలు లేవు. రూ. 15వేల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లయితే ఈ మొత్తానికి 1శాతం ఛార్జీలు విధిస్తారు. ఒక్కో లావాదేవీకి రూ. 3వేలు మాత్రమే పరిమితం చేశారు.

యుటిలిటీ లావాదేవీ:

రూ. 50,000 కంటే తక్కువ వినియోగించేవారికి ఎలాంటి అదనపు ఛార్జీల భారం మోపడం లేదు. అదే రూ. 50వేల కంటే ఎక్కువ వినియోగించినట్లయితే మొత్తం మొత్తానికి 1శాతం ఛార్జ్ తోపాటు ఒక్కో లావదేవీకి రూ. 3వేలకు పరిమితం చేశారు.

ఇక భీమా లావాదేవీలను ఈ ఛార్జీ నుంచి మినహాయించారు.

విద్యాలావాదేవీ

ప్రత్యక్ష చెల్లింపులు: కళాశాల లేదా పాఠశాల వెబ్‌సైట్‌లు లేదా వాటి POS మెషీన్‌ల ద్వారా చేసిన చెల్లింపులు ఛార్జ్-రహితంగా ఉంటాయి.

థర్డ్ పార్టీ యాప్‌లు: CRED, Cheq, MobiKwik,ఇతర యాప్‌ల ద్వారా చేసే లావాదేవీలపై 1శాతం ఛార్జీ, ఒక్కో లావాదేవీకి రూ.3,000 పరిమితం చేశారు..

అంతర్జాతీయ విద్యా చెల్లింపులు: ఈ ఛార్జీ నుండి మినహాయించారు.

అంతర్జాతీయ/క్రాస్ కరెన్సీ లావాదేవీలు

కొత్త ఛార్జ్: అన్ని అంతర్జాతీయ లేదా క్రాస్ కరెన్సీ లావాదేవీలపై 3.5% మార్కప్ ఛార్జ్.

ఆలస్య చెల్లింపు ఛార్జ్

రూ. 100 నుండి రూ. 1,300 వరకు ఉన్న బ్యాలెన్స్ మొత్తం ఆధారంగా రివిజన్.

EMI ప్రాసెసింగ్ ఛార్జ్

కొత్త ఛార్జ్: ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్‌లలో సులభమైన-EMI ఎంపికను పొందడంపై రూ.299 వరకు ప్రాసెసింగ్ ఛార్జీ చెల్లించాలి.

ఇతర మార్పులు

టాటా న్యూ ఇన్ఫినిటీ,టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డ్‌లు: ఆగస్ట్ 1, 2024 నుండి, ఈ కార్డ్‌ల వినియోగదారులు టాటా న్యూ UPI IDని ఉపయోగించి చేసిన అర్హత గల UPI లావాదేవీలపై 1.5% NewCoinsని పొందుతారు.

ఆస్తికి సంబంధించిన దీర్ఘకాలిక మూలధన లాభాలపై సూచికను ముగించడం మెరుగైన రాబడిని సంపాదించడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News