Fuel Price: రేపు దేశవ్యాప్తంగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Fuel Price: దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి.

Update: 2022-11-29 06:57 GMT

Fuel Price: రేపు దేశవ్యాప్తంగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Fuel Price: దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడంతో దాని ప్రభావంతో భారత్ లోనూ చమురు ధరలు తగ్గనున్నాయి. ప్రతి నెలా చివరి రోజున పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపెనీలు సమీక్షించనున్నాయి. చైనాలో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయడంతో ఆ దేశంలో క్రూడ్ ఆయిల్స్ కు డిమాండ్ తగ్గింది. అమెరికాలోనూ చమురు ధరలు పడిపోయాయి. డిసెంబర్ 2021 నుండి చమురు ధరలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. US బెంచ్‌మార్క్ అయిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఆయిల్.. ఫ్యూచర్స్ మార్కెట్ లో నిన్న 2.7శాతానికి పడిపోయింది. బ్యారెల్ ముడి చమురు ధర 74 డాలర్లకి చేరుకుంది. గ్లోబల్ బెంచ్‌మార్క్ అయిన.. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ లో 2.9శాతం పడిపోయి.. చమురు ధరలు 81డాలర్లకి దగ్గరగా ట్రేడ్ అవుతున్నాయి.

చైనాలో కఠినమైన కరోనా వైరస్ ఆంక్షలు.. క్రూడ్ ఆయిల్ డిమాండ్‌ను బలహీనంగా ఉంచడంతో.. జూన్ నుండి గ్లోబల్ చమురు ధరలు దాదాపు 35 శాతం పడిపోయాయి. ప్రపంచంలోని పలు ప్రధాన ఆర్థిక వ్యవస్థలు మాంద్యం వైపు వెళుతున్నాయని సంకేతాలు ఇవ్వడంతో ముడి చమురు ధరలు భారీగా పడిపోతున్నాయి. ప్రధాన చమురు ఉత్పత్తిదారుల.. ఓపెక్ గ్రూప్ ఈ నెల నుండి రోజుకు 2 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తిని తగ్గించినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పడిపోయాయి.

కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఆండ్ ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్ అతిపెద్ద కోత విధించాయి. ఓపెక్ గ్రూప్ ఆదివారం మళ్లీ సమావేశం కానుంది. పాశ్చాత్య దేశాలు చమురు ధరను తగ్గించాలని నిర్ణయించుకుంటే, అది ప్రపంచ ఇంధన సంక్షోభాన్ని రేకెత్తిస్తుందని నిపుణుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Full View
Tags:    

Similar News