ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం.. మారుతున్న నిబంధనలు ఏంటంటే..!

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం.. మారుతున్న నిబంధనలు ఏంటంటే..!

Update: 2022-03-31 06:30 GMT

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం.. మారుతున్న నిబంధనలు ఏంటంటే..!

April:1 ఏప్రిల్ 2022 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ రోజు నుంచి అనేక నిబంధనలు మారుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను, బ్యాంకుకు సంబంధించిన నిబంధనలలో మార్పులు జరుగుతున్నాయి. క్రిప్టో ఆస్తులపై ఆదాయపు పన్ను విధిస్తున్నారు. EPF కోసం కొత్త పన్ను నియమాలు, కోవిడ్-19 చికిత్సపై పన్ను మినహాయింపు వరకు అనేక విషయాలు ఉన్నాయి. ఈ ప్రధాన మార్పుల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

క్రిప్టోకరెన్సీల ద్వారా వచ్చే ఆదాయంపై ఏప్రిల్ 1 నుంచి పన్ను విధిస్తారు. 30 శాతం పన్ను, 1 శాతం TDS వేయనున్నారు. నష్టాలతో సంబంధం లేకుండా క్రిప్టో కరెన్సీల్లో వచ్చే లాభాలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1న ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేక సౌకర్యం కల్పిస్తున్నారు. ఐటీ రిటర్నుల్లో తప్పులు జరిగినట్లయితే పన్ను చెల్లింపుదారులు అప్‌డేట్‌ చేసిన రిటర్నును దాఖలు చేయాల్సి ఉంటుంది. సంబంధిత మదింపు సంవత్సరం ముగిసిన రెండేండ్లలోపు ఈ వెసులుబాటు ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ 1 నుంచి కొత్త సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఉద్యోగులు ఇప్పుడు సెక్షన్ 80CCD(2) కింద తమ ప్రాథమిక జీతంలో 14% వరకు ఎన్‌పిఎస్ కంట్రిబ్యూషన్ కోసం డిడక్షన్‌ను క్లెయిమ్ చేయగలుగుతారు. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కేంద్ర ప్రభుత్వోద్యోగుల మాదిరి సౌకర్యం లభించనుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఐటీ నిబంధన (25వ సవరణ) 2021ను అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో EPF ఖాతాలోకి వెళ్లే మొత్తాల్లో రూ.2.5 లక్షల వరకే పన్ను ఉంటుంది. ఇది దాటితే వడ్డీ ఆదాయంపై పన్ను వర్తిస్తుంది.

Tags:    

Similar News