Save Tax: మీరు పన్ను ఆదా చేయాలంటే ఈ విషయాలు అస్సలు మరిచిపోకండి..!

Save Tax: నేటి కాలంలో ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Update: 2022-07-07 10:30 GMT

Save Tax: మీరు పన్ను ఆదా చేయాలంటే ఈ విషయాలు అస్సలు మరిచిపోకండి..!

Save Tax: నేటి కాలంలో ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఖర్చుల నిర్వహణకు బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు సహాయం తీసుకోవాల్సి వస్తోంది. దీని కారణంగా చాలామంది తమ ఆదాయం నుంచి పన్ను ఆదా చేయాలని ఆలోచిస్తున్నారు. వాస్తవానికి మీరు సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఒకవేళ మీ పరిమితి అయిపోయినట్లయితే మీకు అనేక ఇతర ఎంపికలు ఉన్నాయి. దీని ద్వారా మీరు ఆదాయంపై పన్నును ఆదా చేయవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

1. ఇంటి అద్దె

ఉద్యోగాలు చేసే వారు ఇంటి అద్దె భత్యంతో పన్నును తగ్గించుకోవచ్చు. ఉద్యోగులకు కంపెనీ నుంచి HRA ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80GG కింద మినహాయింపు లభిస్తుంది.

2. విద్యా రుణం

ఉన్నత విద్య కోసం రుణం తీసుకున్నవారు దీనిపై చెల్లించే వడ్డీపై పన్ను మినహాయింపు లభిస్తుంది. 12వ తరగతి తర్వాత ఉన్నత చదువులు ఉంటాయి. సెక్షన్ 80E కింద రుణంపై వచ్చే వడ్డీపై పన్ను మినహాయింపు లభిస్తుంది.

3. డిపాజిట్లపై వచ్చే ఆదాయం

ఆదాయపు పన్ను సెక్షన్ 80TTB కింద డిపాజిట్లపై వచ్చే వడ్డీపై పన్ను మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 80TTB కింద గరిష్ట పరిమితి సంవత్సరానికి రూ. 50,000వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇది 1 ఏప్రిల్ 2018 నుంచి సీనియర్ సిటిజన్‌లకు అందుబాటులో ఉంది.

4. నేషనల్ పెన్షన్ స్కీమ్

మీరు నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)లో పెట్టుబడి పెడితే సెక్షన్ 80CCD (1B) కింద మీరు రూ. 50 వేల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు.

5. ఆరోగ్య బీమా

మీరు 60 ఏళ్ల లోపు ఉండి ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లిస్తుంటే రూ.25 వేల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. దీని కింద మీరు మీ జీవిత భాగస్వామి, మీ పిల్లల ప్రీమియం చెల్లించవచ్చు. ఈ ప్రీమియం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80డి కింద మినహాయింపు ఉంటుంది. 60 ఏళ్లు దాటిన వారికి రూ.50 వేల వరకు పన్ను ప్రయోజనం ఉంటుంది.

Tags:    

Similar News