Interest Rates: ఈ పొదుపు స్కీంలపై వడ్డీ పెరిగింది.. ఒక్కసారి గమనించండి..!

Interest Rates: ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లని పెంచాయి.

Update: 2022-06-21 12:00 GMT

Interest Rates: ఈ పొదుపు స్కీంలపై వడ్డీ పెరిగింది.. ఒక్కసారి గమనించండి..!

Interest Rates: ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లని పెంచాయి. అయితే పోస్టాఫీసు అందించే వడ్డీరేట్లకంటే ఇవి తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. అందులో పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతా మంచి వడ్డీరేట్లని అందిస్తోంది. ఇందులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయడం ద్వారా 6.7% వరకు వడ్డీ పొందవచ్చు. నిర్ణీత వ్యవధిలో ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా స్థిరమైన రాబడిని సంపాదించవచ్చు. ఇందులో కనీస పెట్టుబడి రూ.1000. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు.

ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ ఎఫ్‌డిపై వచ్చే వడ్డీ 40 వేల రూపాయల కంటే తక్కువ ఉంటే దానిపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పరిమితి 60 ఏళ్లలోపు వారికి, అలాగే 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ల 50 వేల రూపాయల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీని కంటే ఎక్కువ ఆదాయంపై 10% TDS కట్‌ అవుతుంది.

ప్రస్తుతం డిపాజిట్ స్కీమ్, ఎఫ్‌డీలో 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంటుంది. దీని కింద మీరు రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడిపై ఆదాయపు పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ ప్రయోజనం 5 సంవత్సరాల బ్యాంకుల FDలపై కూడా అందుబాటులో ఉంటుంది.

Tags:    

Similar News