బ్యాంకు ఖాతాదారులకి అలర్ట్‌.. జనవరి చివరి వారంలో డబ్బు విత్‌డ్రా చేయలేరు..!

Bank Strike: జనవరి చివరి వారంలో బ్యాంకుకు వెళ్లే కస్టమర్‌లు ఇబ్బంది పడవచ్చు.

Update: 2023-01-23 09:15 GMT

బ్యాంకు ఖాతాదారులకి అలర్ట్‌.. జనవరి చివరి వారంలో డబ్బు విత్‌డ్రా చేయలేరు..!

Bank Strike: జనవరి చివరి వారంలో బ్యాంకుకు వెళ్లే కస్టమర్‌లు ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే జనవరి 28 నుంచి 31 వరకు బ్యాంకు సేవలు నిలిచిపోతాయి. 2 రోజుల పాటు సమ్మె చేయాలని బ్యాంక్ యూనియన్ నిర్ణయం తీసుకుంది. బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా ఏటీఎంలలో నగదు ఉండటం కష్టం. దాదాపు 4 రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు లభించవు.

బ్యాంక్ యూనియన్ జనవరి 30, 31 తేదీలలో సమ్మెను ప్రకటించింది. దీంతో పాటు జనవరి 28 నాలుగో శనివారం అలాగే జనవరి 29 ఆదివారం కారణంగా బ్యాంకులు మూసివేసి ఉంటాయి. కాబట్టి ముఖ్యమైన పని ఉంటే శుక్రవారం లోపే ముగించుకుంటే మంచిది. లేదంటే ఫిబ్రవరి 1 వరకు ఆగాల్సిందే. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యుఎఫ్‌బియు) సమావేశం ముంబైలో జరిగింది. ఇందులో రెండు రోజుల పాటు సమ్మె చేయాలని బ్యాంకు యూనియన్లు నిర్ణయించాయి. ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బ్యాంకు యూనియన్లు సమ్మెకు దిగుతున్నాయి.

అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ వెంకటాచలం మాట్లాడుతూ.. యునైటెడ్‌ ఫోరమ్‌ సమావేశం నిర్వహించి 2 రోజుల పాటు సమ్మె చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో పాటు ఎన్‌పీఎస్‌ రద్దు చేసి జీతం పెంచేందుకు చర్చలు జరపాలన్నది ఉద్యోగుల డిమాండ్‌. వీటన్నింటితో పాటు అన్ని కేడర్‌లలో నియామక ప్రక్రియను ప్రారంభించాలనే డిమాండ్ కూడా ఉంది.

Tags:    

Similar News