Car Loan: కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..!

Car Loan: మీరు కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ వార్త మీకోసమే. పెరుగుతున్న కార్ల ధరల మధ్య బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) కార్ రుణాలపై వడ్డీ రేటును తగ్గించింది.

Update: 2022-05-06 07:30 GMT

Car Loan: కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..!

Car Loan: మీరు కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ వార్త మీకోసమే. పెరుగుతున్న కార్ల ధరల మధ్య బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) కార్ రుణాలపై వడ్డీ రేటును తగ్గించింది. దీంతో మీకు ప్రత్యక్ష ప్రయోజనం లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కార్ రుణాలపై వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించింది అంటే వడ్డీ రేటు 7 శాతానికి నిర్ణయించింది. ఒకవైపు వివిధ బ్యాంకులు రుణంపై వడ్డీని పెంచుతుండగా మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీని తగ్గించి పెద్ద ఊరటనిచ్చింది. వడ్డీ రేటు తగ్గింపుతో పాటు రుణ ప్రాసెసింగ్ ఫీజును కూడా తగ్గించినట్లు బ్యాంకు తెలిపింది.

ఈ ఆఫర్ కింద బ్యాంక్ కస్టమర్ల నుంచి ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 1,500 + GST ​​వసూలు చేస్తుంది. ఈ ఆఫర్ జూన్ 30, 2022 వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ ప్రయోజనం కొత్త కారు కొనుగోలుపై మాత్రమే అందుబాటులో ఉంటుంది. వడ్డీ రేటు కస్టమర్ 'క్రెడిట్ ప్రొఫైల్'కి లింక్ అయి ఉంటుంది. బ్యాంక్ జనరల్ మేనేజర్ హెచ్‌టి సోలంకి మాట్లాడుతూ "కారు రుణాలపై వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు తగ్గించాం. కస్టమర్‌లు తమకు నచ్చిన వాహనాన్ని ఇప్పుడు సులభంగా కొనుగోలు చేయవచ్చు".

అయితే సెకండ్ హ్యాండ్ కార్లు, ద్విచక్ర వాహనాల రుణాలపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. గత నెలలో బ్యాంక్ ఆఫ్ బరోడా గృహ రుణాలపై వడ్డీ రేటును 6.75 నుంచి 6.50 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. మీరు 7 సంవత్సరాల పాటు రూ. 10 లక్షల కారు లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తే, 7.25 శాతంతో మీరు ప్రతి నెలా రూ. 15,215 EMI చెల్లించాలి. ఇప్పుడు మీరు అదే రుణాన్ని సంవత్సరానికి 7% పొందినట్లయితే మీరు ప్రతి నెలా రూ. 15,093 EMI చెల్లించాలి. అంటే ప్రతి నెలా రూ.122 తక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదిలో రూ.1464 మిగులుతుంది. 

Tags:    

Similar News