Bank Holidays 2022: ఖాతాదారులు అలర్ట్‌.. ఏప్రిల్‌లో 15 రోజులు బ్యాంకు సెలవులు..!

Bank Holidays 2022: మార్చి నెలాఖరుకు ఇంకా వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది.

Update: 2022-03-24 13:30 GMT

Bank Holidays 2022: ఖాతాదారులు అలర్ట్‌.. ఏప్రిల్‌లో 15 రోజులు బ్యాంకు సెలవులు..!

Bank Holidays 2022: మార్చి నెలాఖరుకు ఇంకా వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. అయితే ఏప్రిల్‌లో బ్యాంకులకు దాదాపు 15 రోజులు సెలవులు వస్తున్నాయి. గుడి పడ్వా, అంబేద్కర్ జయంతి, బైశాఖి వంటి పండుగల కారణంగా ఏప్రిల్‌లో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూసివేస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏప్రిల్ 2022 కోసం బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. RBI జాబితా ప్రకారం.. వచ్చే నెల ఏప్రిల్‌లో వారపు సెలవులతో సహా మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూసివేసి ఉంటాయి.

ఆర్‌బీఐ జాబితా విడుదల

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన సెలవుల జాబితా ప్రకారం.. దేశవ్యాప్తంగా బ్యాంకులకు ఏకకాలంలో సెలవులు ఉండవు. వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే పండుగలు లేదా ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక సందర్భాలలో జరుపుకునే రోజులని బట్టి ఉంటాయి. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. అయితే ఏప్రిల్‌లో ఎన్ని సెలవులు ఉంటాయి. అవి ఎలా అప్లై అవుతాయో తెలుసుకుందాం.

సెలవుల జాబితా..

ఏప్రిల్ 1 – బ్యాంకు ఖాతాల వార్షిక ముగింపు – దాదాపు అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేసి ఉంటాయి.

ఏప్రిల్ 2 – గుడి పడ్వా / ఉగాది పండుగ / నవరాత్రి మొదటి రోజు / తెలుగు నూతన సంవత్సరం / – బేలాపూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇంఫాల్, జమ్ము , ముంబై, నాగ్‌పూర్, పనాజీ, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూసివేస్తారు.

ఏప్రిల్ 3 - ఆదివారం (వారంతపు సెలవు)

ఏప్రిల్ 4 - సరిహుల్‌లో బ్యాంకులు మూసివేస్తారు- రాంచీ

ఏప్రిల్ 5 - బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు - హైదరాబాద్‌లో బ్యాంకులు మూసివేస్తారు.

ఏప్రిల్ 9 - శనివారం (2వ శనివారం )

ఏప్రిల్ 10 – ఆదివారం (వారంతపు సెలవు)

ఏప్రిల్ 14 – డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి/ మహావీర్ జయంతి/ బైసాఖి/ తమిళ నూతన సంవత్సరం/ చైరోబా, బిజు ఫెస్టివల్/ బోహర్ బిహు – షిల్లాంగ్, సిమ్లా కాకుండా ఇతర ప్రదేశాలలో బ్యాంకులు మూసివేస్తారు.

15 ఏప్రిల్ - గుడ్ ఫ్రైడే/బెంగాలీ న్యూ ఇయర్/హిమాచల్ డే/విషు/బోహాగ్ బిహు - జైపూర్, జమ్మూ, శ్రీనగర్ కాకుండా ఇతర ప్రదేశాలలో బ్యాంకులు మూసివేస్తారు.

16 ఏప్రిల్ - బోహాగ్ బిహు - గౌహతిలో బ్యాంక్ మూసివేస్తారు.

17 ఏప్రిల్ - ఆదివారం (వారంతపు సెలవు)

21 ఏప్రిల్ - గడియా పూజ - అగర్తలాలో బ్యాంక్ మూసివేస్తారు.

23 ఏప్రిల్ - శనివారం (నాలుగో శనివారం)

24 ఏప్రిల్ - ఆదివారం (వారంతపు సెలవు)

29 ఏప్రిల్ - షాబ్-ఎ-ఖద్ర్/జుమత్-ఉల్-విదా - జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులు మూసివేస్తారు. 

Tags:    

Similar News