Beer: బీర్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంచనున్న ప్రముఖ కంపెనీలు..

Beer: దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, ఆహార పదార్థాల ధరలు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తున్నాయి.

Update: 2022-05-31 07:30 GMT

Beer: బీర్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంచనున్న ప్రముఖ కంపెనీలు..

Beer: దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, ఆహార పదార్థాల ధరలు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పుడు బీర్ ప్రియులకు కూడా బ్యాడ్ న్యూస్ . ఎందుకంటే త్వరలో బీర్ ధరలు పెరగబోతున్నాయి. ముడిసరుకు ధరలు పెరగడంతో ఇప్పుడు బీరు ధరలు పెంచే అవకాశం ఉందని పలు కంపెనీలు చెబుతున్నాయి. దీంతో పాటు వేసవి కాలంలో బీర్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ధరలు పెంచాలని కంపెనీలు ఆలోచిస్తున్నాయి.

బీరు తయారీకి ఉపయోగించే బార్లీ ధర మూడు నెలల్లో రెండింతలు పెరిగిందని కంపెనీలు వాదిస్తున్నాయి. దీంతో పాటు బాటిలింగ్ కంపెనీలు కూడా ధరలను 30 శాతం పెంచాయి. ఇదొక్కటే కాదు లేబుల్ నుంచి బాక్స్ వరకు ధరలు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీర్ ధరను పెంచాలని కంపెనీలపై ఒత్తిడి వస్తోంది. ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, మహారాష్ట్ర సహా పలు నగరాల్లో బీర్ ధరలను పెంచబోతున్నామని యునైటెడ్ బ్రూవరీస్ సీఈవో రిషి పర్డాల్ తెలిపారు. ధరల పెంపుదల వినియోగదారుడిపై పెద్దగా భారం పడకుండా సరైన రీతిలో చర్యలు తీసుకుంటామన్నారు. UB కంపెనీ హీనెకెన్, కింగ్‌ఫిషర్ బ్రాండ్‌ల బీర్‌ను తయారు చేస్తుంది.

మరోవైపు పెరుగుతున్న ఖర్చుల కారణంగా కంపెనీపై భారం పెరిగిందని ఇలాంటి పరిస్థితుల్లో మన ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయని దివాన్స్ మోడ్రన్ బ్రూవరీస్ ఎండీ ప్రేమ్ దేవాన్ అన్నారు. కంపెనీ బీరు ధరలను పెంచాలి లేదా వాటిపై తగ్గింపును రద్దు చేయాలి. దివాన్స్ కంపెనీ గాడ్‌ఫాదర్, సిక్స్ ఫీల్డ్స్, కోట్స్‌బర్గ్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల బీర్‌ను తయారు చేస్తుంది. దేశంలో మద్యం ధరలపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. దీంతో పాటు అమ్మకం ద్వారా రాష్ట్రాలకు భారీ ఆదాయం వస్తుంది. ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో మద్యం షాపుల సంఖ్య పెరగడానికి, వాటి లైసెన్స్‌లు జారీ చేయడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావడానికి ఇదే కారణం.

Tags:    

Similar News