Credit Card Details: క్రెడిట్​ కార్డు వాడుతున్నారా.. ఎప్పుడైనా ఈ విషయాలు గమనించారా..!

Credit Card Details: నేటి కాలంలో క్రెడిట్​ కార్డులు వాడటం కామన్​గా మారింది. దాదాపు ప్రతి ఒక్కరు ఏదో ఒక బ్యాంకు క్రెడిట్​ కార్డుని కలిగి ఉంటున్నారు.

Update: 2023-09-22 15:00 GMT

Credit Card Details: క్రెడిట్​ కార్డు వాడుతున్నారా.. ఎప్పుడైనా ఈ విషయాలు గమనించారా..!

Credit Card Details: నేటి కాలంలో క్రెడిట్​ కార్డులు వాడటం కామన్​గా మారింది. దాదాపు ప్రతి ఒక్కరు ఏదో ఒక బ్యాంకు క్రెడిట్​ కార్డుని కలిగి ఉంటున్నారు. బ్యాంకులు కూడా పిలిచి మరీ క్రెడిట్​ కార్డులు అందిస్తున్నాయి. దీనివల్ల బ్యాంకులకు మరింత లాభం చేకూరుతుంది. వాస్తవానికి క్రెడిట్​ కార్డు వల్ల లాభాలుంటాయి నష్టాలుంటాయి. దానిని వాడే విధానంపై ఇది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ క్రెడిట్​ కార్డు క్లోజ్​ చేయాలని అనుకుంటే ఎలాంటి విషయాలపై ప్రభావం పడుతుందో ఈరోజు తెలుసుకుందాం.

మంచి క్రెడిట్ హిస్టరీని కలిగి ఉండాలని కోరుకునే వారికి కచ్చితంగా క్రెడిట్ కార్డ్‌లు సహాయం చేస్తాయి. అందుకే చాలామంది ఒకటి కంటే ఎక్కువ కార్డులను కలిగి ఉంటున్నారు. వీటిని వినియోగిస్తే పర్వాలేదు కానీ వాడకుండా పక్కన పెడితే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల అనవసరంగా వార్షిక చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఇలాంటి కార్డులు ఉంటే క్లోజ్​ చేసుకోవడం ఉత్తమం.

క్రెడిట్ కార్డు ఎప్పుడు క్లోజ్​ చేయాలి..?

మీరు క్రెడిట్​ కార్డుని తీసుకొని వినియోగించకుంటే క్లోజ్​ చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే వీటి మెయింటనెన్స్​కు చెల్లించే ఖర్చులు మిగులుతాయి. భవిష్యత్​లో లోన్​ తీసుకోవాలనుకునేవారు ఇలాంటి కార్డులని క్లోజ్ చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల మంచి వడ్డీరేటుని పొందుతారు. 

క్రెడిట్ స్కోరుపై ప్రభావం

క్రెడిట్ కార్డ్‌ క్లోజ్​ చేసే సమయంలో అందులో బ్యాలెన్స్ ఉంటే క్రెడిట్ వినియోగ రేటులో మెరుగుదల ఉంటుంది. క్రెడిట్ వినియోగ రేటు ఎంత తక్కువగా ఉంటే క్రెడిట్ స్కోర్ అంత మెరుగ్గా ఉంటుంది. లేట్​ పేమెంట్​ హిస్టరీ కలిగి ఉంటే క్రెడిట్​ కార్డు క్లోజ్​ చేయడం వల్ల క్రెడిట్ స్కోర్‌కు మరింత నష్టం జరగకుండా కాపాడవచ్చు. 

Tags:    

Similar News