Investment: తొలిసారి పెట్టుబడి పెడుతున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.. లేదంటే తీవ్రంగా నష్టపోతారు..!

Investment Idea: మీరు పెట్టుబడి పెట్టడం ప్రారంభించిన వెంటనే దీన్ని గుర్తుంచుకోవాలి. మీకు రిస్క్ గురించి పూర్తి సమాచారం ముందే తెలిసి ఉండాలి.

Update: 2023-06-10 15:00 GMT

Investment: తొలిసారి పెట్టుబడి పెడుతున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.. లేదంటే తీవ్రంగా నష్టపోతారు..!

Investment Idea: పెట్టుబడి పెట్టాని చాలామంది చూస్తుంటారు. అయితే, ఎక్కడ, ఎలా అనే సందేహాలు వస్తుంటాయి. చేతిలో డబ్బులు ఉన్నా.. కొన్ని విషయాలను పట్టించుకోకుండా హాడావిడిగా పెట్టుబడులు పెడుతుంటారు. అయితే, వీటి వల్ల చాలా అనర్థాలు జరగుతుంటాయి. అన్ని విషయాలను పూర్తిగా తెలుసుకున్నాకే రంగంలోకి దిగాలి. మీరు తొలిసారి పెట్టుబడి పెడుతున్నారా.. అయితే, మీరు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్త పడాలి. పెట్టుబడి ప్రారంభంలో కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం వల్ల, భవిష్యత్తు మరింత మెరుగుపడుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎంత రిస్క్ తీసుకోవాలి?

మీరు పెట్టుబడి పెట్టడం ప్రారంభించిన వెంటనే దీన్ని గుర్తుంచుకోవాలి. మీకు రిస్క్ గురించి పూర్తి సమాచారం ముందే తెలిసి ఉండాలి. మీరు మీ డబ్బుపై ఎంత రిస్క్ తీసుకోవాలో ముందే తెలుసుకోవాలి. మార్కెట్‌లో రిస్క్‌తో కూడిన పెట్టుబడులు అలాగే మార్కెట్‌లో రిస్క్ లేని పెట్టుబడి మాధ్యమాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో, మీ రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి.

పెట్టుబడిని ఎన్ని సంవత్సరాలు ఉంచాలి?

షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలా, మిడ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలా లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలా... మీరు దీని గురించి కూడా తెలుసుకోవాలి. మీరు మీ పెట్టుబడి కాల వ్యవధి గురించి అప్రమత్తంగా ఉండాలి. ఏ కాలానికి పెట్టుబడి పెడుతున్నారు, రాబడులు పొందడం విషయంలో చాలా ముఖ్యం. మీ లక్ష్యం ఏమిటో అర్థం చేసుకున్న తర్వాతే.. మీరు ఆ లక్ష్యాన్ని ఎప్పుడు పూర్తి చేయాలనే దాని ద్వారా వ్యవధిని ఎంచుకోవాల్సి ఉంటుంది.

వైవిధ్యభరితంగా ఉండాలి..

మీ పెట్టుబడులను ఎల్లప్పుడూ విభిన్నంగా ఉంచండి. మీ పెట్టుబడులన్నింటినీ ఒకే చోట పెట్టుబడి పెట్టకండి. మీరు మీ పెట్టుబడులన్నింటినీ ఒకే చోట ఉంచినట్లయితే, మీరు నష్టపోయినప్పుడు చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి మీ డబ్బును వివిధ ప్రదేశాలలో పెట్టుబడి పెట్టండి.

Tags:    

Similar News