Loan Settlement: లోన్‌ సెటిల్మెంట్ చేస్తున్నారా.. లాభంతో పాటు నష్టం కూడా..!

Loan Settlement: మీరు లోన్ సెటిల్మెంట్ చేయాలనుకుంటే తొందరపడి నిర్ణయం తీసుకోకండి.

Update: 2022-09-14 15:00 GMT

Loan Settlement: లోన్‌ సెటిల్మెంట్ చేస్తున్నారా.. లాభంతో పాటు నష్టం కూడా..!

Loan Settlement: మీరు లోన్ సెటిల్మెంట్ చేయాలనుకుంటే తొందరపడి నిర్ణయం తీసుకోకండి. ప్రతి విషయాన్ని బాగా పరిశీలించండి. లోన్ సెటిల్మెంట్ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉండవచ్చు కానీ నష్టాలు కూడా తక్కువేమీ కాదు. ఒక వ్యక్తి 91 రోజుల పాటు నిరంతరంగా రుణాన్ని చెల్లించకపోతే బ్యాంకు ఆ రుణాన్ని నాన్-పెర్ఫార్మింగ్ అసెట్ (NPA) కేటగిరీలో ఉంచుతుంది. తర్వాత డిఫాల్టర్ అభ్యర్థనపై బ్యాంక్ OTSని అంటే వన్ టైమ్ సెటిల్‌మెంట్‌ను అందిస్తుంది. బకాయి ఉన్న మొత్తం OTSలో భాగంగా తీసుకుంటారు. వడ్డీ మొత్తం, పెనాల్టీ, ఇతర ఛార్జీలు తగ్గించే అవకాశం ఉంటుంది. లేదా కొన్ని సందర్భాలలో మాఫీ కూడా చేయవచ్చు. ఇంకా కొన్నిసార్లు లోన్‌ అమౌంట్‌లో కూడా ఉపశమనం లభించవచ్చు.

లోన్ సెటిల్మెంట్ ప్రయోజనాలు

లోన్ సెటిల్మెంట్ చేయడం ద్వారా రికవరీ ఏజెన్సీల నుంచి బయటపడతారు. రుణగ్రహీత తన సొంతంగా లేదా బ్యాంక్‌తో అంగీకరించిన నిబంధనలు, షరతులపై బకాయిని క్లియర్ చేస్తాడు. అయితే లోన్ సెటిల్‌మెంట్ అనేది లోన్ క్లోజర్ కాదని గుర్తుంచుకోండి. దీనివల్ల రుణగ్రహీత క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటుంది. ఇది 50 నుంచి 100 పాయింట్ల కంటే తక్కువకి పడిపోతుంది. రుణాన్ని తిరిగి చెల్లించడానికి రుణగ్రహీత వద్ద డబ్బు లేదని బ్యాంకు వారు నమ్ముతారు. అందుకే అతను లోన్ సెటిల్మెంట్ ఎంపికను ఎంచుకున్నట్లు భావిస్తారు.

రుణం పొందడం కష్టం

రుణం సెటిల్ అయినప్పుడు క్రెడిట్ రిపోర్ట్‌లోని స్టేటస్‌లో లోన్‌ సెటిల్ అయిందని ఉంటుంది. ఇది ఏడేళ్లపాటు అలాగే కనిపిస్తుంది. ఈ సమయంలో మళ్లీ రుణం పొందడం చాలా కష్టం. మీకు వేరే ఎంపిక లేనప్పుడు మాత్రమే లోన్ సెటిల్మెంట్ ఎంపికను ఎంచుకోవాలి. దానికంటే మీరు కుటుంబం లేదా స్నేహితుల నుంచి డబ్బు అప్పుగా తీసుకోవడం ఉత్తమం. మీ రుణాన్ని పునర్నిర్మించడానికి, వడ్డీ రేటును తగ్గించడానికి లేదా తిరిగి చెల్లించే వ్యవధిని పొడిగించడానికి లెండింగ్ ఏజెన్సీతో చర్చలు చేయడం మంచిది. బకాయి ఉన్న మొత్తాన్ని పూర్తిగా చెల్లించడానికి మీరు తక్కువ వడ్డీకి వ్యక్తిగత రుణాన్ని తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.

Tags:    

Similar News