Petrol Pump Scams: పెట్రోల్‌ పంపులో అవకతవకలు జరుగుతున్నాయా.. ఇక్కడ ఫిర్యాదు చేయండి..!

Petrol Pump Scams: నేటి రోజుల్లో పెట్రోల్‌ బంకుల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. అందులో పనిచేసే సిబ్బంది అవకతవకలకు పాల్పడుతూ వినియోగదారులను మోసం చేస్తున్నారు.

Update: 2023-11-27 04:30 GMT

Petrol Pump Scams:పెట్రోల్‌ పంపులో అవకతవకలు జరుగుతున్నాయా.. ఇక్కడ ఫిర్యాదు చేయండి..!

Petrol Pump Scams: నేటి రోజుల్లో పెట్రోల్‌ బంకుల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. అందులో పనిచేసే సిబ్బంది అవకతవకలకు పాల్పడుతూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. ఇచ్చిన డబ్బులకు సరిపడ ఇంధనం పోయడం లేదు. దీనికి తోడు మెషీన్‌ సాఫ్ట్‌వేర్‌లో చిప్‌లు అమరుస్తూ తెలియకుండానే డబ్బులు దోచుకుంటున్నారు. మీరు పెట్రోల్‌ కొట్టించుకోవడానికి బంక్‌కు వెళ్లినప్పుడు ఇంధనం తక్కువగా వచ్చిందని అనుమానం ఉంటే మీరు కొన్ని నెంబర్లకు కాల్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

HP పెట్రోల్ పంపుపై ఫిర్యాదు

HP పెట్రోల్ పంపులో ఏదైనా సమస్య ఉంటే మీరు HP గ్యాస్ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1800-2333-555కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు . ఇది కాకుండా మీరు మీ ఫిర్యాదును ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయవచ్చు.

ఇండియన్ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌పై ఫిర్యాదు

ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులో ఏదైనా సమస్య ఉంటే మీరు ఇండియన్ ఆయిల్ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 18002333555 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు

మీరు https://pgportal.gov.in/ పోర్టల్‌ని సందర్శిచి ఫిర్యాదు చేయవచ్చు. ఇది కాకుండా మీరు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించి ఫిర్యాదు చేయవచ్చు. పెట్రోల్ పంపుపై ఫిర్యాదు చేసినప్పుడు విచారణలో దోషిగా తేలితే ఆ బంక్‌పై జరిమానా విధించడంతో పాటు లైసెన్స్‌ను క్యాన్సిల్‌ చేసే అవకాశాలు ఉంటాయి.

పెట్రోల్ స్వచ్ఛతను తెలుసుకోండి

పెట్రోల్ స్వచ్ఛతను దాని సాంద్రతతో కొలుస్తారు. పెట్రోల్ సాంద్రత 730 నుంచి 800 మధ్య ఉంటే అది స్వచ్ఛంగా ఉందని అర్థం. 730 కంటే తక్కువ లేదా 800 కంటే ఎక్కువ ఉంటే అది కల్తీ అయిందని అర్థం. డీజిల్ సాంద్రత 830 నుంచి 900 మధ్య ఉంటుంది.

పెట్రోల్ పంపులో ఉచిత సౌకర్యాలు

పెట్రోల్ పంపులో వాహన టైర్లో గాలి నింపడం, పెట్రోల్, డీజిల్ బిల్లును పొందే హక్కు, ప్రథమ చికిత్స పెట్టె సౌకర్యం, టాయిలెట్ సౌకర్యం, అత్యవసర ఫోన్ కాల్, తాగడానికి స్వచ్ఛమైన నీరు వంటి కొన్ని ఉచిత సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. వీటికి ఎటువంటి ఛార్జీలు చెల్లించవలసిన అవసరం లేదు.

Tags:    

Similar News