Bank Loan Reject: బ్యాంకు లోన్ అప్లికేషన్లు రిజెక్ట్‌ అవుతున్నాయా.. ముందుగా ఈ తప్పులు తెలుసుకోండి..!

Bank Loan Reject: ఒకప్పుడు బ్యాంకు లోన్ తీసుకోవాలంటే కొన్ని రోజులు బ్యాంకు చుట్టు తిరగాల్సి వచ్చేది.

Update: 2023-09-27 14:30 GMT

Bank Loan Reject: బ్యాంకు లోన్ అప్లికేషన్లు రిజెక్ట్‌ అవుతున్నాయా.. ముందుగా ఈ తప్పులు తెలుసుకోండి..!

Bank Loan Reject: ఒకప్పుడు బ్యాంకు లోన్ తీసుకోవాలంటే కొన్ని రోజులు బ్యాంకు చుట్టు తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నిమిషాల్లో పని ముగుస్తుంది. బ్యాంకులు చాలా అడ్వాన్స్‌గా మారాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా హోమ్‌ లోన్‌, కారులోన్‌, పర్సనల్‌ లోన్‌, ఎడ్యుకేషన్‌ లోన్‌ సులువుగా తీసుకోవచ్చు. డాక్యుమెంట్లు, ఐడీ ప్రూఫ్ సరిగ్గా ఉంటే 48 గంటల్లో బ్యాంకులు రుణాన్ని ఆమోదిస్తున్నాయి. కొన్నిసార్లు అన్ని సరిగ్గా ఉన్నా లోన్‌ రిజెక్ట్‌ అవుతుంది. దీనికి కారణాలు చాలా ఉంటాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

నిజానికి బ్యాంకు లోన్ ఇచ్చేముందు ఆ వ్యక్తి క్రెడిట్ స్కోర్‌ని చూస్తుంది. మంచి క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉంటే అతడి లోన్‌ సులువుగా మంజూరవుతుంది. వారం లోపల డబ్బులు కస్టమర్‌ ఖాతాలోకి చేరిపోతాయి. ఒకవేళ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకు అతడి లోన్‌ రిజెక్ట్ చేస్తుంది. వాస్తవానికి 700 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తికి బ్యాంక్ సులభంగా రుణాన్ని మంజూరు చేస్తుంది. ఒకవేళ మీరు క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచుకోవాలనుకుంటే పాత రుణలను సకాలంలో చెల్లించాలి.

వాయిదాలు సకాలంలో చెల్లించ లేదా..

చాలాసార్లు బ్యాంకులు పర్సనల్‌ లోన్లని రిజెక్ట్‌ చేస్తుంటాయి. ఎందుకంటే మీ ఆదాయానికి రుణ మొత్తానికి మధ్య సమన్వయం ఉండదు. ఈ పరిస్థితిలో లోన్‌ తీసుకున్న వ్యక్తి వాయిదాలను సకాలంలో చెల్లించలేడని బ్యాంకు భావిస్తుంది. అందుకే అతడి లోన్‌ రిజెక్ట్‌ అవుతుంది.

సరైన సమాచారం

లోన్‌ అప్లికేషన్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు కూడా బ్యాంకు దానిని రిజెక్ట్ చేస్తుంది. అందువల్ల బ్యాంకు నుంచి లోన్‌ తీసుకోవాలంటే అన్ని వివరాలను సరిగ్గా అందించాలి. అలాగే ఒరిజినెల్‌ పత్రాలను మాత్రమే పెట్టాలి. అప్పుడే బ్యాంక్ మిమ్మల్ని అనుమానించదు. లోన్‌ సమయంలో సరైన సమాచారాన్ని అందించాలి.

స్థిరమైన ఉద్యోగం లేనప్పుడు

మీకు స్థిరమైన ఉద్యోగం లేకపోతే బ్యాంకు లోన్‌ ఇవ్వదు. అలాగే తరచుగా ఉద్యోగాలు మారుతున్నవారికి కూడా లోన్‌ మంజూరు కాదు.

Tags:    

Similar News