ప్రభుత్వ ఉద్యోగులకి అలర్ట్‌.. జీతాలకి సంబంధించి ఈ 3 విషయాలలో మార్పులు..!

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజుల నుంచి జీతాలు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Update: 2023-02-14 07:30 GMT

ప్రభుత్వ ఉద్యోగులకి అలర్ట్‌.. జీతాలకి సంబంధించి ఈ 3 విషయాలలో మార్పులు..!

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజుల నుంచి జీతాలు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. మార్చిలో జీతాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డీఏ పెంపుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఇది కాకుండా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై కూడా ఆశలు పెట్టుకున్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఎదురుచూస్తున్నారు.

7వ పే కమిషన్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మార్చి తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని పెద్ద ప్రకటనలను ఆశించవచ్చు. వీటిలో 7వ పే కమిషన్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ) పెంపు, వేతన సవరణ ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర ఉద్యోగుల కోసం ఇంటి అద్దె అలవెన్స్ లేదా (HRA) నియమాన్ని అప్‌డేట్‌ చేసింది. నివేదికల ప్రకారం 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేవలం ఒక సంవత్సరం మాత్రమే సమయం ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వం వేతన సవరణ కోసం కొత్త ఫార్ములాను ప్రకటించవచ్చు. 2023 హోలీ తర్వాత ఇది జరగవచ్చని అందరు భావిస్తున్నారు.

పెండింగ్‌లో ఉన్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నందున హోలీ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనం పెరిగే అవకాశం ఉందని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపు తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనాన్ని రూ.18,000 నుంచి రూ.26,000కి పెంచనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా జీతం లభిస్తుండగా ప్రస్తుతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతంగా ఉంది. దీనిని 3.68 శాతానికి పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

డిఎ-డిఆర్

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ)ని మార్చి 2023 నుంచి అమలులోకి తీసుకురావచ్చని సూచిస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో డీఏను 4 శాతం పెంచింది. 34 శాతం నుంచి 38 శాతానికి పెరిగింది. ఈ మార్చిలో ప్రభుత్వం 4% DA పెంచవచ్చు. పింఛనుదారుల డియర్‌నెస్ పెన్షన్ (డీఆర్)ని కూడా ప్రభుత్వం పెంచే అవకాశం ఉంది.

Tags:    

Similar News