రైతులకి అలర్ట్‌.. పంట నష్టపోతే వెంటనే ఇక్కడ ఫిర్యాదు చేయండి..!

రైతులకి అలర్ట్‌.. పంట నష్టపోతే వెంటనే ఇక్కడ ఫిర్యాదు చేయండి..!

Update: 2022-11-04 11:35 GMT

రైతులకి అలర్ట్‌.. పంట నష్టపోతే వెంటనే ఇక్కడ ఫిర్యాదు చేయండి..!

Farmers Alert: భారతదేశంలో రైతులు ఎక్కువగా ప్రకృతిపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తారు. అందుకే ఒక్కోసారి అతివృష్టి లేదా అనావృష్టి తలెత్తుతుంది. ఒకవైపు వర్షాలు సరిగ్గా కురవక కరువు ఏర్పడితే మరోవైపు అధిక వర్షాల వల్ల వరదలు సంభవించి పంటలు నాశనమవుతాయి. ఈ పరిస్థితిలో రైతులు పంట నష్టంతో పాటు ఆర్థికంగా చితికిపోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులపై రైతులు చింతించాల్సిన అవసరం లేదు.

పంటనష్టం గురించి సకాలంలో ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేస్తే సులువుగా పరిహారం లభిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదు. ఏ అధికారికి లంచం ఇవ్వాల్సిన పనిలేదు. ఎందుకంటే పంట నష్టంపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేసింది. చాలాసార్లు సమాచారం లేకపోవడంతో రైతులు నష్టపరిహారం కోసం డిమాండ్ చేయలేకపోతున్నారు.

పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలు పథకాలు అమలు చేస్తున్నాయి. రైతులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేస్తోంది. ఈ పథకం కింద ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేస్తారు. ప్రకృతి వైపరీత్యాలతో పాటు వ్యక్తిగతంగా నష్టపోయిన రైతులకు కూడా పరిహారం అందిస్తుంది. అయితే గతంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నాశనం అయిన పంటలకి సామూహిక ప్రయోజనం మాత్రమే అందుబాటులో ఉండేది.

వరదలు, కరువులు, అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పెద్ద ఎత్తున పంట నాశనమైతే రైతులు 72 గంటల్లో ఫిర్యాదు చేయాలి. రైతులు పంటల బీమా యాప్‌ను సందర్శించి పంట నష్టం గురించి తెలియజేయవచ్చు. ఇది కాకుండా రైతులు సమీపంలోని వ్యవసాయ కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా కూడా పంట నష్టం గురించి సమాచారం అందించవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉన్న రైతులు మాత్రమే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ప్రయోజనాన్ని పొందగలరని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News