Credit Card Bill Payments: క్రెడిట్‌ కార్డుతో బిల్లులు చెల్లించేవారికి అలర్ట్‌.. మే 1 నుంచి అధికంగా చెల్లించాల్సిందే..!

Credit Card Bill Payments: ఈ రోజుల్లో చాలామంది క్రెడిట్‌ కార్డ్స్‌ని వాడుతున్నారు.

Update: 2024-04-30 10:14 GMT

Credit Card Bill Payments: క్రెడిట్‌ కార్డుతో బిల్లులు చెల్లించేవారికి అలర్ట్‌.. మే 1 నుంచి అధికంగా చెల్లించాల్సిందే..!

Credit Card Bill Payments: ఈ రోజుల్లో చాలామంది క్రెడిట్‌ కార్డ్స్‌ని వాడుతున్నారు. అన్ని బిల్లులు వీటిద్వారానే చెల్లిస్తున్నారు. ఎందుకంటే వీటిని ఉపయోగించడం వల్ల బ్యాంకులు, కంపెనీలు రివార్డ్స్‌ పాయింట్లను, డిస్కౌంట్లను అందిస్తున్నాయి. దీంతో ఎంతో కొంత మొత్తం ఆదా చేసుకోవచ్చని భావిస్తారు. అందుకే క్రెడిట్‌ కార్డ్స్‌తో బిల్లులు చెల్లించడానికి అలవాటు పడిపోయారు. అయితే బ్యాంకులు ఇప్పుడు అవార్డులకు బదులు సర్వీస్ చార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమయ్యాయి.

యెస్‌ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ మే 1 నుంచి యుటిలిటీ బిల్లులపై 1% అదనంగా ఛార్జ్ చేయనున్నాయి. యెస్‌ బ్యాంక్‌లో ఈ లిమిట్ రూ. 15వేలు ఉంటే ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లో రూ. 20 వేలు ఉంది. ఈ లిమిట్ క్రాస్ అయితే వినియోగదారుడు వన్ పర్సెంట్ అదనంగా పే చేయాల్సి ఉంటుంది. యుటిలిటీ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ తక్కువగా ఉండటం వల్ల బ్యాంకులకు తక్కువ ఆదాయం వస్తుంది. కాబట్టి దీన్ని ఫుల్ ఫిల్ చేసుకునేందుకు స్పెషల్ గా చార్జీలు కలెక్ట్ చేస్తున్నాయి.

అంతేకాదు కొంత మంది బిజినెస్ డీల్స్ చేస్తూ క్రెడిట్ కార్డులను మిస్ యూజ్ చేస్తున్నారు. క్రెడిట్ లిమిట్ తో పోలిస్తే యుటిలిటీ బిల్లుల మొత్తం చాలా తక్కువ ఉంటుండగా.. బిజినెస్ డీల్స్ ను యుటిలిటీ బిల్లు కింద చూపిస్తూ బెనిఫిట్ పొందుతున్నారు. అందుకే బ్యాంకులు ఇలా అదనపు రుసుము వసూలు చేసేందుకు సిద్దమయ్యాయి. మే 1 నుంచి ఈ బాదుడు మొదలవుతుంది. కాబట్టి క్రెడిట్‌ కార్డ్స్‌ ఉన్నవారు జర జాగ్రత్తగా పే చేయాల్సి ఉంటుంది.

Tags:    

Similar News