Alert: బంగారం కొనేవారికి అమ్మేవారికి అలర్ట్‌.. జూన్‌ నుంచి ఈ నియమం వర్తిస్తుంది..!

Alert: మీరు బంగారం కొనుగోలు చేయాలని అనుకున్నట్లయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోండి.

Update: 2022-05-31 12:02 GMT

Alert: బంగారం కొనేవారికి అమ్మేవారికి అలర్ట్‌.. జూన్‌ నుంచి ఈ నియమం వర్తిస్తుంది..!

Alert: మీరు బంగారం కొనుగోలు చేయాలని అనుకున్నట్లయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోండి. జూన్ 1 నుంచి మీకు దేశంలో స్వచ్ఛమైన బంగారం మాత్రమే లభిస్తుంది. ఆభరణాల విక్రయాలకి సంబంధించి కొత్త నిబంధన అమలవుతోంది. ఇప్పుడు దేశంలో హాల్‌మార్కింగ్ లేకుండా వ్యాపారులు బంగారాన్ని విక్రయించలేరు. వాస్తవానికి బంగారంలో నకిలీని తొలగించేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయడం ద్వారా దేశంలోని ప్రజలు నకిలీ బంగారం నుంచి విముక్తి పొందుతారు. ఇంతకుముందు దీనికి మూడు కేటగిరీల బంగారంపై మినహాయింపు ఇచ్చారు. కానీ ఇప్పుడు అన్ని గ్రేడ్‌ల బంగారానికి హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి చేసింది.

BIS హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను తెలిపే గుర్తు. జూన్‌ 1 నుంచి దీన్ని తప్పనిసరి చేశారు. హాల్‌మార్క్ చేయబడిన బంగారం 100% ధృవీకరించబడిన బంగారం. ఈసారి ప్రభుత్వం రెండో దశ హాల్‌మార్కింగ్‌ను ప్రారంభిస్తుండగా ఇందులో హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసి మూడు గ్రేడ్‌లను చేర్చారు. అంటే ఈసారి 20 క్యారెట్లు, 23 క్యారెట్లు, 24 క్యారెట్లని ఈ లిస్టులో చేర్చారు. మొదటి దశలో ఇది 23 జూన్ 2021న దేశంలోని 256 జిల్లాల్లో అమలు చేశారు.

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 4 ఏప్రిల్ 2022 న నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా రెండో దశ హాల్‌మార్కింగ్ అమలును ప్రకటించింది. ఇప్పటి వరకు 14 క్యారెట్, 18 క్యారెట్, 20 క్యారెట్, 22 క్యారెట్, 23 క్యారెట్, 24 క్యారెట్ అనే 6 స్వచ్ఛత కేటగిరీలకు బంగారం హాల్‌మార్కింగ్ తప్పనిసరి. దీంతో పాటు హాల్‌మార్కింగ్‌లో BIS లోగో, ఖచ్చితత్వ గ్రేడ్, ఆరు అంకెల ఆల్ఫాన్యూమరికల్ కోడ్‌ను పేర్కొనడం తప్పనిసరి చేశారు. జూన్ 1 నుంచి కస్టమర్ ప్రతి బంగారు ఆభరణంపై హాల్‌మార్కింగ్ ఫీజుగా రూ. 35 చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. 

Tags:    

Similar News