Alert: గ్యాస్‌ కస్టమర్లకి అలర్ట్‌.. వారికి మాత్రమే సబ్సిడీ డబ్బులు..!

Alert: రోజు రోజుకి పెరుగుతున్న ధరల వల్ల సామన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2022-05-22 09:30 GMT

Alert: గ్యాస్‌ కస్టమర్లకి అలర్ట్‌.. వారికి మాత్రమే సబ్సిడీ డబ్బులు..!

Alert: రోజు రోజుకి పెరుగుతున్న ధరల వల్ల సామన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ ధరలని భారీగా తగ్గించింది. గ్యాస్ సిలిండర్‌పై రూ.200, డీజిల్‌పై రూ.7, పెట్రోల్‌పై రూ.9.50 తగ్గించారు. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ సిలిండర్ల కొత్త ధరలు శనివారం రాత్రి నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. చాలా కాలంగా ఇంధనం, ద్రవ్యోల్బణం గురించి ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ విషయంలో ప్రభుత్వం ముందడుగు వేస్తూ నిర్ణయం తీసుకుంది.

సామాన్యుల సంక్షేమం గురించి ఆలోచించాలని ప్రధాని నరేంద్ర మోదీ జైపూర్‌లో పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ తర్వాత రెండోసారి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆయన కృషి చేశారు. సహజంగానే ఈ నిర్ణయం ప్రజలకు గొప్ప ఉపశమనం కలిగించింది.

గ్యాస్ సిలిండర్ల ధరలపై మాట్లాడితే సామాన్యులకు ఇందులో ఊరట లభించింది. ఒక్కో సిలిండర్‌పై రూ.200 తగ్గించారు. ఈ రూ.200 సబ్సిడీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉజ్వల పథకం లబ్ధిదారులు మాత్రమే ఉపయోగించుకోగలరు. అలాగే ఏడాదిలో 12 సిలిండర్లకు మాత్రమే రూ.200 సబ్సిడీ లభిస్తుంది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. 'మేము లీటరు పెట్రోల్‌పై రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నాము. దీంతో లీటరు పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గుతుంది. ఈ సంవత్సరం 9 కోట్ల మందికి పైగా (ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు) గ్యాస్ సిలిండర్‌పై (12 సిలిండర్ల వరకు) రూ. 200 సబ్సిడీని అందిస్తున్నాం.' అని తెలిపారు. 

Tags:    

Similar News